ఢిల్లీలో కోవిడ్ ‘విలయం’, పరిస్థితి సమీక్షకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర అఖిలపక్ష సమావేశం

| Edited By: Anil kumar poka

Nov 19, 2020 | 10:19 AM

ఢిల్లీలో కోవిడ్ కేసులు ఒక్కసారిగా విజృంభించాయి. బుధవారం ఒక్కరోజే 7,486 కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో పెరిగిన కేసుల సంఖ్య 5 లక్షలకు పెరిగింది.

ఢిల్లీలో కోవిడ్ విలయం, పరిస్థితి సమీక్షకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర అఖిలపక్ష సమావేశం
Follow us on

ఢిల్లీలో కోవిడ్ కేసులు ఒక్కసారిగా విజృంభించాయి. బుధవారం ఒక్కరోజే 7,486 కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో పెరిగిన కేసుల సంఖ్య 5 లక్షలకు పెరిగింది. నిన్న ఒక్కరోజే 131 మంది కరోనా రోగులు మృతి చెందారు. ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 7,943 కి చేరింది. ఈ నెల 17 న 62 వేల టెస్టులు నిర్వహించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాజిటివ్ రేటు 12.03 శాతమని ఈ వర్గాలు పేర్కొన్నాయి. దీపావళి సీజన్ తో బాటు వాయుకాలుష్యం కూడా పెరగడం కేసుల ఉధృతికి ఓ కారణమని అంటున్నారు. నగరంలో కరోనావైరస్ పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ అత్యవసరంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, కోవిడ్ హాట్ స్పాట్ లు గా మారిన మార్కెట్లు, బజార్లను మూసివేస్తామని ఆయన హెచ్చ రించారు.