గ్వాలియర్ లో ‘జ్యోతిరాదిత్యుడు’, బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణలు

| Edited By: Pardhasaradhi Peri

Aug 23, 2020 | 4:30 PM

'బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా శనివారం సాయంత్రం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ను సందర్శించిన సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాటలు, చిరు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో..

గ్వాలియర్ లో జ్యోతిరాదిత్యుడు, బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణలు
Follow us on

‘బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా శనివారం సాయంత్రం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ను సందర్శించిన సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాటలు, చిరు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో కమల్ నాథ్ ప్రభుత్వ పతనానికి జ్యోతిరాదిత్య సింధియాయే కారణమంటూ వందలాది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసనలకు దిగడంతో వారిని అడ్డగించేందుకు బీజేపీ వర్కర్లు కూడా ‘రంగంలోకి దిగారు’. గ్వాలియర్ లో మూడు రోజుల బీజేపీ మెంబర్ షిప్ (సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని) ని ప్రారంభించేందుకు సింధియా ఇక్కడ అడుగుపెట్టారు. అయితే రెండు పార్టీల నేతలూ, కార్యకర్తలూ భౌతిక దూరమన్న ప్రసక్తి లేకుండా ఒకరికొకరు తోపులాటలకు దిగారు. మాజీ మంత్రి లఖన్ సింగ్ యాదవ్ సహా పలువురు కాంగ్రెస్ వారు సింధియాను అడ్డుకోవడానికి యత్నించడంతో పోలీసులు వారిని అతి కష్టంమీద అదుపులోకి తీసుకున్నారు. సింధియాను వీరంతా ‘దేశద్రోహి’గా ఆరోపించారు.

అయితే దీన్ని ఆయన లక్ష్యపెట్టకుండా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తోను, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తోను కలిసి మెంబర్ షిప్ డ్రైవ్ ని లాంచ్ చేశారు. రాష్ట్రంలో రానున్న నెలల్లో 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రచారానికి దీన్ని నాందిగా భావిస్తున్నారు. ఈ 27 నియోజకవర్గాల్లో 16 సెగ్మెంట్లు గ్వాలియర్-చంబల్ ప్రాంతంలోనే ఉన్నాయి. రాష్ట్రంలో అవినీతికి మాజీ సీఎం కమలనాథ్ బాధ్యుడని ఈ సందర్భంగా సింధియా ఆరోపించారు.