‘నీట్’, ‘జేఈఈ’ పరీక్షలు వాయిదా వేయాలి, గ్రెటా థన్ బెర్గ్

| Edited By: Anil kumar poka

Aug 25, 2020 | 2:56 PM

ఈ కరోనా వైరస్ తరుణంలో విద్యార్థులకు 'నీట్'. 'జేఈఈ' (2020) పరీక్షల నిర్వహణ సముచితం కాదని పర్యావరణవేత్త గ్రెటా థన్ బెర్గ్ పేర్కొంది.

నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలి, గ్రెటా థన్ బెర్గ్
Follow us on

ఈ కరోనా వైరస్ తరుణంలో విద్యార్థులకు ‘నీట్’. ‘జేఈఈ’ (2020) పరీక్షల నిర్వహణ సముచితం కాదని పర్యావరణవేత్త గ్రెటా థన్ బెర్గ్ పేర్కొంది. సెప్టెంబరులో వీటిని నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసిందే. అయితే ఈ గ్లోబల్ పాండమిక్ సమయంలో వీటిని వాయిదా వేయడమే సముచితమని గ్రెటా ట్వీట్ చేసింది. ఇండియాలో బిహార్ , అస్సాం వంటి రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో లక్షలాది ప్రజలు అల్లల్లాడుతున్నారని, అందువల్ల ఈ పరీక్షలను వాయిదా  వేయాలన్న విద్యార్థులు డిమాండును తాను సమర్థిస్తున్నానని ఆమె వ్యాఖ్యానించింది. అటు-అనేకమంది విద్యార్థులు ప్రస్తుతానికి ఈ పరీక్షల నిర్వహణ యోచన సరికాదని అంటూ సుప్రీంకోర్టుకెక్కారు.’అయితే కోర్టు మాత్రం ఐద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా వీటిని సెప్టెంబర్ లో నిర్వహించాలని సూచించింది.