ఏకంగా సుప్రీంకోర్టుపైనే సెటైర్లు, కోర్టు ధిక్కరణ ఆరోపణలతో చిక్కుల్లో పడిన కమెడియన్ ‘ట్వీటర్’ కునాల్ కమ్రా

| Edited By: Pardhasaradhi Peri

Nov 12, 2020 | 8:59 PM

రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడంపై వ్యంగ్యంగా, జోకింగ్ గా ట్వీట్లు చేసిన కమెడియన్ కునాల్ కమ్రా చిక్కుల్లో పడ్డారు. కోర్టు ధిక్కరణ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. క్రిమినల్ కంటెంప్ట్ కి గాను కునాల్ పై దావా వేసేందుకు ఓ లా విద్యార్థికి, ఇద్దరు లాయర్లకు అటార్నీ జనరల్ కేకే.వేణుగోపాల్ అనుమతించారు. ఈ మధ్యకాలంలో ప్రజలు అత్యున్నత న్యాయస్థానాన్ని, జడ్జీలను అనుచితంగా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, ఇందుకు చివరకు శిక్షార్హులవుతున్నారని ఆయన […]

ఏకంగా సుప్రీంకోర్టుపైనే సెటైర్లు, కోర్టు ధిక్కరణ ఆరోపణలతో చిక్కుల్లో పడిన కమెడియన్ ట్వీటర్ కునాల్ కమ్రా
Follow us on

రిపబ్లిక్ టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడంపై వ్యంగ్యంగా, జోకింగ్ గా ట్వీట్లు చేసిన కమెడియన్ కునాల్ కమ్రా చిక్కుల్లో పడ్డారు. కోర్టు ధిక్కరణ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. క్రిమినల్ కంటెంప్ట్ కి గాను కునాల్ పై దావా వేసేందుకు ఓ లా విద్యార్థికి, ఇద్దరు లాయర్లకు అటార్నీ జనరల్ కేకే.వేణుగోపాల్ అనుమతించారు. ఈ మధ్యకాలంలో ప్రజలు అత్యున్నత న్యాయస్థానాన్ని, జడ్జీలను అనుచితంగా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, ఇందుకు చివరకు శిక్షార్హులవుతున్నారని ఆయన అన్నారు. కునాల్ ట్వీట్లు దారుణంగా ఉండడమే గాక, హాస్యానికి, ధిక్కరణకు మధ్య ఉన్న లక్ష్మణ రేఖను పూర్తిగా క్రాస్ చేశాయని ఆయన ఆరోపించారు. భావ ప్రకటనా స్వేఛ్చ పేరిట ఎవరుబడితే వారు ధైర్యంగా ఇలా అత్యున్నత న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను దుయ్యబడుతున్నారని వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.

లోగడ ముంబై నుంచి లక్నోకు  ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న అర్నాబ్ గోస్వామి పట్ల కునాల్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో 5 ఎయిర్ లైన్స్ ఈయనను బ్యాన్ చేశాయి.