రేసిజం ఎఫెక్ట్.. సోషల్ మీడియాలో కోకకోలా ప్రకటనలకు బ్రేక్

| Edited By: Pardhasaradhi Peri

Jun 27, 2020 | 5:17 PM

గ్లోబల్ అడ్వర్టైజింగ్ లో ప్రధాన భూమిక పోషిస్తున్న కోకకోలా సంస్థ సోషల్ మీడియాలో యాడ్స్ ని కనీసం 30 రోజులపాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. రేసిస్ట్ కంటెంట్ తో కూడిన యాడ్స్ ని ఈ సంస్థ ప్రకటిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తడంతో..

రేసిజం ఎఫెక్ట్.. సోషల్ మీడియాలో కోకకోలా ప్రకటనలకు బ్రేక్
Follow us on

గ్లోబల్ అడ్వర్టైజింగ్ లో ప్రధాన భూమిక పోషిస్తున్న కోకకోలా సంస్థ సోషల్ మీడియాలో యాడ్స్ ని కనీసం 30 రోజులపాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. రేసిస్ట్ కంటెంట్ తో కూడిన యాడ్స్ ని ఈ సంస్థ ప్రకటిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తడంతో తామీ చర్య తీసుకుంటున్నట్టు ఈ సంస్థ చైర్మన్, సీఈఓ కూడా అయిన జేమ్స్ క్విన్ సే తెలిపారు. ప్రపంచంలో రేసిజానికి తావు లేదని, ఇది సోషల్ మీడియాకు కూడా వర్తిస్తుందని ఆయన అన్నారు. ద్వేష పూరిత కంటెంట్ ని ఇతర పెద్ద కంపెనీలు బాయ్ కాట్ చేశాయని, మరింత జవాబుదారీ, పారదర్శకత ఉండేలా యాడ్ లను మార్చవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాయని జేమ్స్ వివరించారు. మా  అడ్వటైజింగ్ విధానాలను సమీక్షించుకోవడానికి, మార్పులు చేయాలా అన్న విషయాన్ని నిర్ధారించుకోవడానికి ఈ 30 రోజుల విరామ కాలాన్ని వినియోగించుకుంటామన్నారు. అయితే అంతమాత్రాన ఆఫ్రికన్ అమెరికన్లు ప్రారంభించిన బ్లాక్ లైవ్స్ మూవ్ మెంట్ ఉద్యమంలో తాము పాల్గొంటున్నట్టు కాదని స్పష్టం చేశారు. ఇలా ఉండగా ఫేస్ బుక్, ట్విటర్, ఇన్స్ టా గ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఈ సంవత్సరాంతం వరకు తమ ప్రకటనలను నిలిపివేస్తామని యూనీ లీవర్, బెన్ అండ్ జెర్సీ కూడా ప్రకటించాయి.