నియంత్రిత విధానంలో సాగు.. రైతే రారాజుః కేసీఆర్

|

Jun 03, 2020 | 5:42 PM

రాష్ట్రంలో నియంత్రిత పద్దతిలో పంటల సాగు విధానం అమలు చేసే ప్రక్రియలో భాగంగా తెలంగాణ సీఎం కేసిఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసే అలవాటు రైతాంగంలో రావాలన్నారు. దీని కోసం వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఈ సారి వర్షాకాలం పంటతో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమల్లోకి వస్తుందని.. ఇది ప్రతీ ఏటా ప్రతీ సీజన్‌లో కొనసాగాలని ఆకాంక్షించారు. […]

నియంత్రిత విధానంలో సాగు.. రైతే రారాజుః కేసీఆర్
Follow us on

రాష్ట్రంలో నియంత్రిత పద్దతిలో పంటల సాగు విధానం అమలు చేసే ప్రక్రియలో భాగంగా తెలంగాణ సీఎం కేసిఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసే అలవాటు రైతాంగంలో రావాలన్నారు. దీని కోసం వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఈ సారి వర్షాకాలం పంటతో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమల్లోకి వస్తుందని.. ఇది ప్రతీ ఏటా ప్రతీ సీజన్‌లో కొనసాగాలని ఆకాంక్షించారు.

మార్కెట్లో అమ్ముడుపోయే పంటను మాత్రమే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని, రైతులు తమ పంటకు ధర రాని దుస్థితి ఉండదని సీఎం తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో పంటల సాగు పద్ధతిగా జరగడం కోసం అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయడానికి ముఖ్యమంత్రి కేసిఆర్ వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ రంగ నిపుణులతో మూడు రోజుల పాటు విస్తతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం పలు సూచనలు ఇచ్చారు.

  • వ్యవసాయ అధికారులు ప్రపంచ వ్యాప్తంగా ఏ పంటకు డిమాండ్ ఉందో తెలుసుకుని.. దానికి అనుగుణంగా రాష్ట్రంలో పంటల సాగు జరగేలా చూడాలి. ఇది ఏ ఒక్క ఏడాదికో పరిమితం కావద్దు. నిరంతరం సాగుతుంది. దీనికోసం ప్రభుత్వం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కమిటీని నియమిస్తుంది.
  • తెలంగాణలో పత్తి పంట ఎక్కువగా పండిస్తున్నారు. పత్తిలో ఉత్పాదకత పెంచడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలి? ఏ రకమైన పత్తికి మార్కెట్ ఉంది? అలాంటి పత్తి సాగు చేయాలంటే ఏం చేయాలి? తదితర విషయాలను అధ్యయనం చేసి, తగు సూచనలు ఇవ్వడానికి, పత్తి రైతులకు చేదోడు వాదోడుగా ఉండడానికి ప్రభుత్వం కాటన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తుంది.
  • తెలంగాణలో విభిన్న స్వభావాలు కలిగిన నేలలున్నాయి. ఏ నేలలు ఏ పంట సాగుకు అనువైనవో తేల్చాలి. దానికి అనుగుణంగా పంటల సాగు చేపట్టాలి. పంటల కాలనీల ఏర్పాటు కోసం నేలల విభజన చేయాలి. ఈ వివరాలను రైతులకు తెలపాలి. అంతేకాక ప్రజలు నిత్యం తినే పండ్లు, కూరగాయలను రాష్ట్రంలో దిగుమతి చేసుకుంటున్నాం. ఏఏ రకాల పండ్లు, కూరగాయలు దిగుమతి చేసుకంటున్నామో లెక్కలు తీయాలి. వాటిని మన రాష్ట్రంలోనే పండించాలి.
  • ఉల్లిగడ్డల లభ్యత, ధరల విషయంలో ప్రతీ ఏడాది అనిశ్చితి, అస్పష్టత నెలకొంది. అందుకే తెలంగాణ ప్రజల అవసరాలకు తగ్గట్టు ఉల్లి సాగు జరగాలి. ఎప్పుడూ కొరత లేకుండా చూసే వ్యూహం అవలంభించాలి. చిక్కుడు, మునగలో మంచి పోషకాలు ఉన్నాయి. వాటిని ఎక్కువగా తినేలా ప్రజలను చైతన్య పరచాలి. వాటి సాగు పెంచాలి.
  • రాష్ట్రంలో కొత్తగా అనేక ప్రాజెక్టులు నిర్మాణమవుతున్నాయి. మిషన్ కాకతీయతో చెరువుల నీటి సామర్థ్యం పెరిగింది. భూగర్భ జలాలు పెరిగాయి. 24 గంటల ఉచిత విద్యుత్ వల్ల బోర్ల ద్వారా సాగు పెరిగింది. దీంతో ప్రతీ ఏటా కొత్తగా ఆయకట్టు పెరుగుతూ వస్తున్నది. పెరిగిన/పెరిగే విస్తీర్ణాన్ని సరిగ్గా అంచనా వేస్తూ, పంటల సాగు ప్రణాళికలు తయారు చేయాలి. హర్టికల్చర్ డిపార్టుమెంటును మారిన పరిస్థితులకు అనుగుణంగా మార్చాలి. సరైన పంటల లెక్కల నమోదు కోసం ప్రత్యేకంగా స్టాటిస్టికల్ విభాగం ఏర్పాటు చేయాలి.