ఏపీలో పెన్షన్లపై రివ్యూ..వారికి ఒకేసారి రెండు నెలల పెన్షన్…

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్లపై గందరగోళ పరిస్థితి నెలకుంది. అధిక సంఖ్యలో పెన్షన్లు తొలిగించారంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తహశీల్దార్ కాళ్లకు మొక్కి వినూత్న నిరసన చేశారు. ప్రతిపక్షాలు ప్రస్తుతం ఈ ఇష్యూను హైలెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆందోళనలకు సిద్దమవుతోన్న వేళ..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు(మంగళవారం) కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్..తొలగించిన పెన్షన్ల దారుల పత్రాలను మరోసారి రివ్యూ చేయాలని ఆదేశించారు. […]

ఏపీలో పెన్షన్లపై రివ్యూ..వారికి ఒకేసారి రెండు నెలల పెన్షన్...
Follow us

|

Updated on: Feb 12, 2020 | 9:02 AM

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్లపై గందరగోళ పరిస్థితి నెలకుంది. అధిక సంఖ్యలో పెన్షన్లు తొలిగించారంటూ విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తహశీల్దార్ కాళ్లకు మొక్కి వినూత్న నిరసన చేశారు. ప్రతిపక్షాలు ప్రస్తుతం ఈ ఇష్యూను హైలెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆందోళనలకు సిద్దమవుతోన్న వేళ..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు(మంగళవారం) కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్..తొలగించిన పెన్షన్ల దారుల పత్రాలను మరోసారి రివ్యూ చేయాలని ఆదేశించారు. ఒకవేళ పొరపాటున అర్హులను తొలగించినట్లు తేలితే..వచ్చే నెలలో రెండు నెలల పెన్షన్ కలిపి అందించాలని అధికారులకు తేల్చి చెప్పారు. కాగా అర్హులైన వారు పెన్షన్ కొరుకు దరఖాస్తు పెట్టుకుంటే..5 రోజుల్లోనే పెన్షన్ కార్డు వచ్చేలా ప్రభుత్వం అధికారులకు మార్గనిర్దేశకాలు జారీ చేసింది. రీ వెరిఫై చేసిన పెన్షన్ల తుది జాబితా ఫిబ్రవరి 20 న ప్రకటిస్తారు అధికారులు. ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మార్చి 1వ తేదీన పెన్షన్ కార్డుతో పాటు రెండు పించన్ కూడా అందనుంది.