కరోనాపై సమరం.. పాకిస్తాన్ కు చైనా సాయం..

| Edited By: Anil kumar poka

Mar 29, 2020 | 4:50 PM

తన మిత్ర దేశమైన పాకిస్తాన్ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చైనా.. ఆ దేశానికి తమ వైద్య సిబ్బందిని, మెడికల్ సాధనాలను విమానం ద్వారా పంపింది. కరోనాను ఎదుర్కొనగల 'సాహసం' తమదేనని చాటుకోవడానికి చైనా అన్ని ప్రయత్నాలూ చేస్తోంది.

కరోనాపై సమరం.. పాకిస్తాన్ కు చైనా సాయం..
Follow us on

తన మిత్ర దేశమైన పాకిస్తాన్ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చైనా.. ఆ దేశానికి తమ వైద్య సిబ్బందిని, మెడికల్ సాధనాలను విమానం ద్వారా పంపింది. కరోనాను ఎదుర్కొనగల ‘సాహసం’ తమదేనని చాటుకోవడానికి చైనా అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఈ దేశానికి చెందిన డాక్టర్లు, వైద్య పరికరాలతో కూడిన విమానం శనివారం ఉదయం ఇస్లామాబాద్ విమానాశ్రయానికి  చేరుకోగానే పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ దానికి ఎదురువెళ్ళి.. చైనా డాక్టర్లను సాదరంగా స్వాగతించారు. ఇటీవలే చైనా.. పాక్ కు వెంటిలేటర్లను, మాస్కులను సరఫరా చేసింది. ఇక అణ్వాయుధాలను మోసుకుపోగల క్షిపణులను కూడా అందజేసింది.

ప్రస్తుతం పాక్ లో కరోనా పాజిటివ్ కేసులు 1400 కి పైగా నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు. కరోనా ఇన్ఫెక్షన్ సోకినవారిలో చాలామంది పొరుగునున్న ఇరాన్ నుంచి తిరిగి వఛ్చిన వారే! ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ లతో గల తన సరిహద్దులను పాకిస్థాన్ మూసివేసింది. కరోనా విలయతాండవం చేస్తున్నప్పటికీ పాక్ అధికారులు.. ప్రపంచ వ్యాప్తంగా గల ఇస్లామిక్ మత గురువులను లాహోర్ సిటీ బయట చేరుకునేందుకు అనుమతించారు.  అక్కడ మూడు రోజులపాటు జరిగే మతపరమైన కార్యక్రమాల్లో వీరంతా పాల్గొంటారట. ఈ గురువుల్లో దాదాపు 200 మందిని క్వారంటైన్ కి తరలించారు. కానీ… వీరిలో చాలామంది కరోనా పాజిటివ్ లక్షణాలతోనే తమ స్వదేశాలకు బయలుదేరి వెళ్లారు. చూడబోతే.. కరోనాపట్ల  పాకిస్థాన్ ప్రభుత్వం ఉదాసీనంగా ఉన్నట్టు కనిపిస్తోంది.