చికెన్ వింగ్స్ లో కరోనా పాజిటివ్.. చైనా ఆందోళన

| Edited By: Pardhasaradhi Peri

Aug 13, 2020 | 3:37 PM

బ్రెజిల్ నుంచి దిగుమతి అయిన ఫ్రోజెన్ (మంచుగడ్డల్లో నిల్వ చేసిన) చికెన్ వింగ్స్ ( కోడి రెక్కలభాగం) లో కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని చైనా బాంబు..

చికెన్ వింగ్స్ లో కరోనా పాజిటివ్.. చైనా ఆందోళన
Follow us on

బ్రెజిల్ నుంచి దిగుమతి అయిన ఫ్రోజెన్ (మంచుగడ్డల్లో నిల్వ చేసిన) చికెన్ వింగ్స్ ( కోడి రెక్కలభాగం) లో కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని చైనా బాంబు పేల్చింది. ఇంపోర్ట్ చేసుకున్న వీటిని తినరాదని  చైనా లోని  షెన్జెన్ సిటీవాసులు హెచ్చ రిస్తున్నారు. వీటి శాంపిల్స్ లో ఈ పాజిటివ్ ఉన్నట్టు ల్యాబ్ లో తేలిందని అధికారులు కూడా వెల్లడించారు. ముఖ్యంగా  ఈ వింగ్స్ పై భాగంలోని మాంసం లో ఈ వైరస్ ఉందని వారు పేర్కొన్నారు. బ్రెజిల్ లోని అరోరా ఎలిమెంట్స్ ప్లాంట్ నుంచి ఇవి దిగుమతి అయినట్టు తెలుస్థోంది. అయితే  వీటికి, లేదా ఈ ఉత్పత్తులతో కాంటాక్ట్ లో ఉన్నవారిని టెస్ట్ చేయగా అందరికీ నెగెటివ్ వచ్చింది.ఇక అలాగే సీ ఫుడ్ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చైనా ప్రభుత్వంవార్నింగ్ ఇస్తోంది.

ఇప్పటికే కరోనా వైరస్ కి చైనా కారణమని ప్రపంచ దేశాలు ఆరోపిస్తుండగా ఇప్పుడు బ్రెజిల్ నుంచి వఛ్చిన చికెన్ వింగ్స్ లో ఈ వైరస్ ఉందని డ్రాగన్ కంట్రీ ఆరోపించడం అనుమానాలకు తావిస్తోంది. కరోనా కేసుల్లో అమెరికా తరువాత బ్రెజిల్ రెండో స్థానంలో ఉన్న విషయం గమనార్హం.