అంతరిక్షంలోకి ఎగసిన చైనా వ్యోమనౌక, అంతా రహస్యమే !

| Edited By: Pardhasaradhi Peri

Sep 05, 2020 | 5:14 PM

చైనా విజయవంతంగా ఓ వ్యోమనౌకను రోదసీలోకి పంపింది.  ఈ అంతరిక్షనౌకను తిరిగి వినియోగించుకోవచ్చునట కూడా ! వాయువ్య చైనా ప్రాంతంలో గల జికువాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఇది నిన్న రోదసీలోకి ఎగసింది..

అంతరిక్షంలోకి ఎగసిన చైనా వ్యోమనౌక, అంతా రహస్యమే !
Follow us on

చైనా విజయవంతంగా ఓ వ్యోమనౌకను రోదసీలోకి పంపింది.  ఈ అంతరిక్షనౌకను తిరిగి వినియోగించుకోవచ్చునట కూడా ! వాయువ్య చైనా ప్రాంతంలో గల జికువాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఇది నిన్న రోదసీలోకి ఎగసింది. ‘లాంగ్ మార్చ్-2ఎఫ్ ‘రాకెట్ దీన్ని కక్ష్యలోకి చేర్చిందని, దీని ప్రయోగాన్ని వీక్షించేందుకు ఎవరినీ అనుమతించలేదని సిన్ హువా వార్తా సంస్థ తెలిపింది. అంటే మరో ప్రపంచానికి తెలియకుండా ఇది చాలా సీక్రెట్ గా జరిగిందన్న మాట.. అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకు వినియో గించుకోవాలన్నదే ఈ ప్రయోగ లక్ష్యమని అంటున్నారు. ఇది మళ్ళీ చైనీస్ లాండింగ్ సైట్ కి  ఎప్పుడు  చేరుతుందో కూడా తెలియదు.  . ప్రస్తుతం భూ కక్ష్యలో తిరుగుతున్న అమెరికా నాసా వారి ‘ఎక్స్ 37 బీ స్పేస్ క్రాఫ్ట్’ లాంటిదే ఈ వ్యోమనౌక కూడా అని సిన్ హువా పేర్కొంది.

చైనా ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడు చేపట్టినా మూడో కంటికి తెలియకుండా నిర్వహిస్తుంది. తమ అధునాతన టెక్నాలజీ గురించి ఎవరికీ తెలియరాదన్నదే డ్రాగన్ కంట్రీ వ్యూహం.