‘మీ వాళ్ళు మా దగ్గరే ఉన్నారు, పంపిస్తున్నాం’, చైనా

| Edited By: Pardhasaradhi Peri

Sep 08, 2020 | 5:58 PM

ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో గల్లంతయిన అయిదుగురు భారతీయులు తమ భూభాగంలోనే ఉన్నారని చైనా భారత్ కు తెలియజేసింది. వారిని మీ దేశానికి పంపే ప్రయత్నంలో ఉన్నామని ఆ దేశం వెల్లడించినట్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఈ ఐదుగురూ మీ భూభాగం లోకి ప్రవేశించారని, వారిని తిప్పి పంపాలంటూ ఇండియన్ ఆర్మీచేసిన హాట్ లైన్ మెసేజ్ కి చైనా స్పందించి ఈ సమాచారం తెలియజేసిందన్నారు. ఈ కుర్రోళ్లంతా 16 […]

మీ వాళ్ళు మా దగ్గరే ఉన్నారు, పంపిస్తున్నాం, చైనా
Follow us on

ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో గల్లంతయిన అయిదుగురు భారతీయులు తమ భూభాగంలోనే ఉన్నారని చైనా భారత్ కు తెలియజేసింది. వారిని మీ దేశానికి పంపే ప్రయత్నంలో ఉన్నామని ఆ దేశం వెల్లడించినట్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఈ ఐదుగురూ మీ భూభాగం లోకి ప్రవేశించారని, వారిని తిప్పి పంపాలంటూ ఇండియన్ ఆర్మీచేసిన హాట్ లైన్ మెసేజ్ కి చైనా స్పందించి ఈ సమాచారం తెలియజేసిందన్నారు. ఈ కుర్రోళ్లంతా 16 నుంచి 22 ఏళ్ళ మధ్య వయస్సు గల విద్యార్థులే !

మెక్ మోహన్ లైన్ కి వెళ్తున్న భారత సైనికులకు నిత్యావసరాలను తీసుకువెళ్లే పోర్టర్ల వెంట వీళ్లూ వెళ్లారు. అయితే దారి తప్పి చైనా భూభాగంలోకి ఎంటరయ్యారు. మొత్తానికి చైనా సరిహద్దుల నుంచి మన సరిహద్దుల్లోకి ప్రవేశించిన 13 చైనా గేదెలు, నాలుగు దూడలను మళ్ళీ చైనా వారికి మన జవాన్లు అప్పగించడం, ఇందుకు వారు కృతజ్ఞతలు చెప్పడం, ఇప్పుడు ఈ తాజా ‘ఘటన’  జరగడం చూస్తే మళ్ళీ రెండు దేశాల మధ్య ‘దోస్తానా’ చిగురించే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ… ఎందుకో లడాఖ్ దగ్గరే ‘లడాయి’ లాంటి చిక్కొఛ్చి పడింది మరి !