లడాఖ్ లో ‘లడాయి;, బియ్యమైతే కావాలి, చైనాకు ఇండియన్ రైస్ ఎగుమతి

| Edited By: Pardhasaradhi Peri

Dec 02, 2020 | 4:37 PM

ఇండియా నుంచి చైనా బియ్యాన్ని దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. దాదాపు మూడు దశాబ్దాల తరువాత భారత బియ్యం ఆ దేశాన్ని చేరుతోంది. ఇతర దేశాలకన్నా తాము కాస్త తక్కువధరకు బియ్యం సరఫరా చేస్తామన్న ఇండియా ఆఫర్..

లడాఖ్ లో లడాయి;, బియ్యమైతే కావాలి, చైనాకు ఇండియన్ రైస్ ఎగుమతి
Follow us on

ఇండియా నుంచి చైనా బియ్యాన్ని దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. దాదాపు మూడు దశాబ్దాల తరువాత భారత బియ్యం ఆ దేశాన్ని చేరుతోంది. ఇతర దేశాలకన్నా తాము కాస్త తక్కువధరకు బియ్యం సరఫరా చేస్తామన్న ఇండియా ఆఫర్ కి డ్రాగన్ కంట్రీ ఓకె  చెప్పింది. ప్రపంచ దేశాల్లో భారత్ అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు కాగా-చైనా అదే స్థాయిలో అతి పెద్ద దిగుమతిదారని పరిశ్రమవర్గాలు  తెలిపాయి. ఏటా ఆ దేశం సుమారు 40 లక్షల టన్నుల బియ్యాన్ని దిగుమతి చేసుకుంటోంది. కానీ నాణ్యత బాగులేదన్న కారణంపై ఇండియా నుంచి దీన్ని దిగుమతి చేసుకోవడం నిలిపివేసింది.

లడాఖ్ లో నియంత్రణ రేఖ వద్ద ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో భారత బియ్యానికి ఆ దేశం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ఇన్నేళ్లకు మొదటిసారిగా చైనా మన బియ్యాన్ని కొనుగోలు చేస్తోందని, దీని క్వాలిటీ చూశాక వచ్ఛే ఏడాది దిగుమతులను మరింత పెంచుకోవచ్చునని రైస్ ఎక్స్ పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు బీవీ.కృష్ణారావు తెలిపారు. డిసెంబరు-ఫిబ్రవరి నెలలకు గాను టన్నుకు సుమారు 300 డాలర్ల చొప్పున ఇండియా నుంచి లక్ష టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు వెల్లడించాయి. చైనాకు సాధారణంగా థాయిలాండ్, వియత్నాం, మయన్మార్, పాకిస్తాన్ దేశాల నుంచి రైస్ ఎగుమతి అవుతుంటుంది. కానీ ఇండియాతో పోలిస్తే అవి టన్నుకు 30 డాలర్లు ఎక్కువగా కోట్ చేస్తున్నాయని, అందుకే చైనా ఇప్పుడు భారత బియ్యం పట్ల ఆసక్తి చూపుతోందని తెలుస్తోంది.