జగన్‌ సినిమా చూడటంపై చంద్రబాబు సెటైర్

| Edited By:

May 03, 2019 | 8:10 PM

వైఎస్ జగన్ అవెంజర్స్‌ సినిమా చూడటంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. గత రెండ్రోజులుగా ఫొని తుపానుపై సూచనలు చేస్తూ, ఇటు అధికారులు, అటు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఫొని ఇవాళ ఉదయం తీరం దాటిన నేపథ్యంలో ఆయన తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్న తీరును వివరించారు. అయితే ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష నేత జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుపాను సమయంలో విపక్ష నేతలు విదేశాలకు వెళుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ […]

జగన్‌ సినిమా చూడటంపై చంద్రబాబు సెటైర్
Follow us on

వైఎస్ జగన్ అవెంజర్స్‌ సినిమా చూడటంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. గత రెండ్రోజులుగా ఫొని తుపానుపై సూచనలు చేస్తూ, ఇటు అధికారులు, అటు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఫొని ఇవాళ ఉదయం తీరం దాటిన నేపథ్యంలో ఆయన తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్న తీరును వివరించారు. అయితే ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష నేత జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుపాను సమయంలో విపక్ష నేతలు విదేశాలకు వెళుతున్నారని వ్యాఖ్యానించారు.

జగన్ కూడా తుపానుకు సంబంధించి అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుందని హాయిగా సినిమాకు వెళ్లారేమో అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. అయినా, జగన్ ఎప్పుడు రాష్ట్రంలో ఉన్నారని, ఇప్పుడు ఉండడానికి.. అంటూ సెటైర్ వేశారు.