కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కోసం కమిటీల ఏర్పాటు, రాష్ట్రాలకు కేంద్రం సూచన

| Edited By: Anil kumar poka

Oct 31, 2020 | 1:20 PM

దేశంలో కోవిడ్ 19 వ్యాక్సినేషన్, పంపిణీ తదితర ఏర్పాట్లను సమన్వయం చేసేందుకు పానెల్స్ (కమిటీలు) ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కోసం కమిటీల ఏర్పాటు, రాష్ట్రాలకు కేంద్రం సూచన
Follow us on

దేశంలో కోవిడ్ 19 వ్యాక్సినేషన్, పంపిణీ తదితర ఏర్పాట్లను సమన్వయం చేసేందుకు పానెల్స్ (కమిటీలు) ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన స్టీరింగ్ కమిటీని, అదనపు చీఫ్ సెక్రటరీ లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యాన టాస్క్ ఫోర్స్ ను, జిల్లా మేజిస్ట్రేట్ అధ్యక్షతన జిల్లా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏడాది కాలంపాటు  వ్యాక్సినేషన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియపై ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్లకుండా, వదంతులకు ఆస్కారం లేకుండా చూసేందుకు ఇప్పటి నుంచే సోషల్ మీడియాపైనా, ఇతర వేదికలపైన నిఘావంటిది ఉండాలన్నారు. వీటి ట్రాకింగ్ ఎంతైనా అవసరం అని రాజేష్ భూషణ్ అభిప్రాయపడ్డారు.