ఈ నెల 26 న రైతుల ట్రాక్టర్ ర్యాలీని ఆ పేలా చూడండి..సుప్రీంకోర్టుకుకేంద్రం విన్నపం, 20 వేల ట్రాక్టర్లతో అన్నదాతలు రెడీ !

| Edited By: Pardhasaradhi Peri

Jan 12, 2021 | 12:21 PM

ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవం నాడు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని ఆపివేసేట్టు చూడాలని కేంద్రం  సుప్రీంకోర్టును కోరింది.  వ్యవసాయ చట్టాలను రద్దు..

ఈ నెల 26 న రైతుల ట్రాక్టర్ ర్యాలీని ఆ పేలా చూడండి..సుప్రీంకోర్టుకుకేంద్రం విన్నపం,  20 వేల ట్రాక్టర్లతో అన్నదాతలు రెడీ !
Follow us on

Farmers Protest: ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవం నాడు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని ఆపివేసేట్టు చూడాలని కేంద్రం  సుప్రీంకోర్టును కోరింది.  వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్లను ఆలోగా కేంద్రం నెరవేర్చకపోతే ట్రాక్టర్ ర్యాలీని నిర్వహిస్తామని రైతు సంఘాలు ఇదివరకే హెచ్ఛరించాయి. జనవరి 26 న 20 వేల ట్రాక్టర్లతో తాము భారీ ట్రాక్టర్ మార్చ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ఈ సంఘాలు పేర్కొన్నాయి. కాగా రిపబ్లిక్ డే రాజ్యాంగ, చరిత్రాత్మక ప్రాధాన్యం గురించి కేంద్రం  లోగడ సుప్రీంకోర్టుకు  వివరించింది. …ఈ మేరకు  ఓ అఫిడవిట్ ను సమర్పించింది. ఆ రోజున జరిగే పరేడ్ వంటి కార్యక్రమాలకు ఏ మాత్రం విఘాతం కలిగినా శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పేర్కొంది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇదిలా ఉండగా రైతుల సమస్యను కేంద్రం సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అత్యున్నత న్యాయస్థానం మళ్ళీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Also Read:

బోనాలు.. శివసత్తుల పూనకాలు.. పెద్ద పట్నాలు.. కన్నుల పండువగా ఐనవోలు మల్లన్న ఆలయ బ్రహ్మోత్సవాలు

విరాట్ కోహ్లీకి పదకొండు అంకెతో విడదీయరాని అనుబంధం.. సోషల్ మీడియాలో చర్చ.. ఎందుకో తెలుసా..

బర్ద్ ఫ్లూ భయం, మరో మూడు రాష్ట్రాలకు వ్యాపించిన ఫ్లూ, కేంద్రం అప్రమత్తం, మనుషులకు వైరల్ సోకదని అభయం,