త్వరలో తెలంగాణకు కేంద్ర బ‌ృందం.. వెల్లడించిన కిషన్‌రెడ్డి

|

Oct 19, 2020 | 2:52 PM

వరుస అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాల కారణంగా కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమైన తెలంగాణ వాసులను మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం...

త్వరలో తెలంగాణకు కేంద్ర బ‌ృందం.. వెల్లడించిన కిషన్‌రెడ్డి
Follow us on

Central team to visit Telangana: వరుస అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాల కారణంగా కురిసిన భారీ వర్షాలతో అతలాకుతలమైన తెలంగాణ వాసులను మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగర ప్రజలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి జీ.కిషన్ రెడ్డి. విపత్తు నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపిన తర్వాత, దానిని పరిశీలించి కేంద్ర బృందం రాష్ట్ర పర్యటనకు వస్తుందని ఆయన చెబుతున్నారు. అయితే ముందు స్టేట్ డిసాస్టర్ ఫండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ఇంకా రాలేదని, వచ్చిన వెంటనే కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు. రాష్ట్ర మంత్రులు కేంద్రంపై తొందరపడి ఆరోపణలు చేయడం సరికాదని కిషన్ రెడ్డి హితవు పలికారు. విపత్తుల కాలంలో కేంద్రానికి కొన్ని పద్దతులున్నాయని, వాటిని ఫాలో అయిన తర్వాత రాష్ట్రానికి సాయం తప్పక అందుతుందని ఆయన తెలిపారు. విపత్తు సమయంలో రాజకీయ విమర్శలు చేయడం సరికాదని, మిగులు రాష్ట్రం, ధనిక రాష్ట్రం అని చెప్పే కేసిఆర్.. ముందు రాష్ట్ర ఖజానా నుంచి నిధులు ఖర్చు పెట్టాలని కిషన్ రెడ్డి సూచించారు.

Also read: బహిరంగచర్చకు రెడీ.. బండికి హరీశ్ సవాల్

Also read: కిస్తులు కట్టిన వారికి త్వరలో మోదీ సర్కార్ శుభవార్త!

Also read: మళ్ళీ వర్షగండం… భయపడొద్దన్న కేటీఆర్