పంథాలు వేరైన వీరిద్దరికీ సాహిత్య అకాడమీ అవార్డులు..

|

Dec 18, 2019 | 7:45 PM

ఇద్దరూ రచయితలే… కానీ ఒకరు రాజకీయ నేత అయితే మరొకరు అధ్యాపకులు.. వీరి పంథాలు, నేపథ్యాలు వేర్వేరు.. కానీ ఇద్దరినీ సాహిత్య అకాడమీ అవార్డులు వరించాయి. . మన తెలుగు రచయిత బండి నారాయణస్వామి రాసిన ‘ శప్తభూమి ‘ అనే నవలకు ఈ అవార్డు లభించగా.. రాజకీయ నేత, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ రచించిన ‘ యాన్ ఎరా ఆఫ్ డార్క్ నెస్ ‘ పుస్తకానికి ఈ పురస్కారం దక్కింది. అనంతపురం జిల్లాకు చెందిన నారాయణ […]

పంథాలు వేరైన వీరిద్దరికీ సాహిత్య అకాడమీ అవార్డులు..
Follow us on

ఇద్దరూ రచయితలే… కానీ ఒకరు రాజకీయ నేత అయితే మరొకరు అధ్యాపకులు.. వీరి పంథాలు, నేపథ్యాలు వేర్వేరు.. కానీ ఇద్దరినీ సాహిత్య అకాడమీ అవార్డులు వరించాయి. . మన తెలుగు రచయిత బండి నారాయణస్వామి రాసిన ‘ శప్తభూమి ‘ అనే నవలకు ఈ అవార్డు లభించగా.. రాజకీయ నేత, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ రచించిన ‘ యాన్ ఎరా ఆఫ్ డార్క్ నెస్ ‘ పుస్తకానికి ఈ పురస్కారం దక్కింది. అనంతపురం జిల్లాకు చెందిన నారాయణ స్వామి .. రాయల కాలం తరువాత 18 వ శతాబ్దం నాటి అనంతపుర సంస్థాన రాజకీయాలను ఈ తన పుస్తకంలో రచించారు. హేండె రాజుల కాలం నాటి ఘటనలు, కక్షలు, కార్పణ్యాల మధ్య నలిగిన ప్రజల జీవితాలను ఈ నవలలో ప్రస్తావించారు.
ఇక శశిథరూర్ తన ‘ యాన్ ఎరా ఆఫ్ డార్క్ నెస్ ‘ బుక్ లో నాడు భారత దేశంపై బ్రిటిష్ పాలకుల ప్రభావం గురించి.. భారత వనరులను వారు ఎలా నాశనం చేసిందీ వివరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు పొందిన ఈ రచయితలకు లక్ష రూపాయల నగదు కూడా లభించనుంది. . వచ్ఛే ఏడాది ఫిబ్రవరి 25 న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను అందజేస్తారు.