అన్ని రకాల కరోనా వైరస్ లు ఖతం ? వస్తోంది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వ్యాక్సీన్ !

| Edited By: Pardhasaradhi Peri

Aug 26, 2020 | 5:26 PM

కేవలం కరోనా వైరస్ లే కాకుండా అన్ని రకాల వైరస్ లను నాశనం చేయగల కొత్త వ్యాక్సీన్ తయారు చేయడానికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నడుం బిగించింది. భవిష్యత్తులో జంతువుల నుంచి మనుషులవరకు వ్యాపించే వైరస్..

అన్ని రకాల కరోనా వైరస్ లు ఖతం ? వస్తోంది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వ్యాక్సీన్ !
Follow us on

కేవలం కరోనా వైరస్ లే కాకుండా అన్ని రకాల వైరస్ లను నాశనం చేయగల కొత్త వ్యాక్సీన్ తయారు చేయడానికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నడుం బిగించింది. భవిష్యత్తులో జంతువుల నుంచి మనుషులవరకు వ్యాపించే వైరస్ లను చెక్ చేసే వ్యాక్సీన్ గా ఇది ఉంటుందని ఈ యూనివర్సిటీ రీసెర్చర్లు తెలిపారు.  సమీప భవిష్యత్తులో దీని ట్రయల్స్ పై దృష్టి నిలిపినట్టు వారు చెప్పారు. ఈ కొత్త వ్యాక్సీన్ ని ‘ డీఐఓఎస్-కో-వాక్స్-2’ గా వ్యవహరిస్తున్నారు. గబ్బిలాలే కాకుండా ఇతర జంతువుల నుంచి జన్యుపరంగా వచ్ఛే వైరస్ లకు ఇది విరుగుడుగా పని చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. నీడిల్ (సూది) లేకుండా స్ప్రింగ్ తో కూడిన జెట్ ఇంజెక్షన్ మాదిరి ఇది ఉంటుందని, దీన్ని తీసుకున్నప్పుడు నొప్పికూడా ఉండని విధంగా దీని తయారీకి యోచిస్తున్నామని వారు పేర్కొన్నారు.