ఈ తరుణంలో యువతదే కీలక బాధ్యత, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

| Edited By: Pardhasaradhi Peri

Aug 15, 2020 | 5:29 PM

ఈ దేశం అభివృధ్ది, వికాస దిశల్లో పయనించాలంటే యువతదే కీలక బాధ్యత అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రతి భారతీయుడు తన విద్యుక్త ధర్మాన్ని పాటించి ఈ దేశాన్ని.

ఈ తరుణంలో యువతదే  కీలక బాధ్యత, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
Follow us on

ఈ దేశం అభివృధ్ది, వికాస దిశల్లో పయనించాలంటే యువతదే కీలక బాధ్యత అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రతి భారతీయుడు తన విద్యుక్త ధర్మాన్ని పాటించి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందన్నారు భారత 74 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన ఈ మేరకు ట్వీట్ చేస్తూ, ఈ సమయంలో ప్రతివారూ ఆత్మపరిశీలన చేసుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. 2022 నాటికల్లా ఈ దేశంలో మనం ఏం సాధించామన్నది ముఖ్యం.. ఆత్మావలోకనం చేసుకోవాల్సి ఉంది.. ఆ సంవత్సరానికి ఇండియా స్వావలంబన సాధించాలి అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

పేదరికం, సామాజిక వివక్ష, అవినీతి ఆంతానికి అంతా కలిసికట్టుగా కృషి చేయాలి అని వెంకయ్యనాయుడు సూచించారు. దేశానికి సాంస్కృతిక పునరుజ్జీవనం అవసరమని, 130 కోట్ల ప్రజలు సరికొత్త భారతావనిని ఆవిష్కరించాలని ఆయన కోరారు.