మానవత్వమా నీవెక్కడా..?

| Edited By: Team Veegam

Sep 15, 2020 | 7:00 PM

కరోనా మహమ్మారి మనుషుల్లోని లోపలి మనిషి బయటకు వస్తున్నాడు. కొందరు చేస్తున్న మంచి పనులు చూస్తే ఇంకా మానవత్వం బతికే ఉందనిపిస్తుంది. అయితే అక్కడక్కడ కనిపిస్తున్న కొన్ని ఘటనలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.

మానవత్వమా నీవెక్కడా..?
Follow us on

మానవత్వమా నీవెక్కడ.. కరోనా మహమ్మారి మనుషుల్లోని లోపలి మనుషులను బయటకు తీసుకోస్తోంది.  కొందరు చేస్తున్న మంచి పనులను చూస్తే ఇంకా మానవత్వం బతికే ఉందనిపిస్తుంది. అయితే అక్కడక్కడ కనిపిస్తున్న కొన్ని ఘటనలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. కరోనా సమయంలో తోచిన సహాయం చేశారు.

అయితే… ఈ ఘ‌ట‌న తెలిసిన త‌ర్వాత అక్కడివారు డబ్బులు తింటున్నా.. అన్నం తింటున్నారా.. అనిపిస్తుంది.  సూప‌ర్ మార్కెట్‌లో ప‌నిచేసే ఓ ఉద్యోగి చ‌నిపోతే.. కనీసం అతనికి మంచి వైద్యం అంచక పోగా.. వారి కుటుంబ స‌భ్యుల‌కు కూడా తెలియ‌జేయ‌లేదు. ఇంతటి అమానవీయ ఘటన బ్రెజిల్‌ల్లో చోటు చేసుకుంది.  కర్రెఫోర్ సూపర్ మార్కెట్‌లో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న మోయిసెస్ సంతోస్ కవాల్కంటే అనే ఉద్యోగి గుండె నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. అతడిని ఆస్పత్రికి తరలించకుండా… స్టోర్‌లోనే అత్యవసర చికిత్స అందించారు. దీంతో గుండెపోటుతో మృతి చెందాడు. ఇంత జరిగినా అతని కుటుంబ సభ్యులకు తెలపడం కానీ.. ఆస్పత్రికి తరలించడం కానీ స్టోర్ యాజమాన్యం చేయలేదు.

అతడి డెడ్ బాడీని ఒక మూట‌లా ప‌డేసి  స్టోర్‌ను రన్ చేశారు. ఆ రోజు వ్యాపారం ఎక్క‌డ న‌డ‌వ‌దో అని శ‌వాన్ని ఒక మూల‌న‌ పెట్టి చుట్టూ గొడుగులు, డ‌బ్బాలు పెట్టారు. దీని గురించి తెలిసిన కొంతమంది ఫోటోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవి బాగా వైర‌ల్ కావ‌డంతో ఆ సూప‌ర్ మార్కెట్ యాజ‌మాన్యంపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్‌ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ఆ సూప‌ర్ మార్కెట్ యాజ‌మాన్యం సారీతో సరిపెట్టింది.