బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ : స్టేడియంలలో ప్రేక్షకులకు అనుమతి

|

Nov 10, 2020 | 5:07 PM

కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు ప్రేక్షకులు లేని ఖాళీ క్రికెట్‌ స్టేడియంలలో మ్యాచ్‌లు ఆడటం చూశాం కదా! ఇన్నాళ్లకు ప్రేక్షకుల మధ్యన క్రికెట్‌ మ్యాచ్‌లను చూడబోతున్నాం.. ఆస్ట్రేలియా- ఇండియా మధ్య జరగబోయే మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించబోతున్నారు.. ఇందుకోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా ఏర్పాట్లు చేస్తోంది.. మార్చి తర్వాత మొదటిసారి లైవ్‌ మ్యాచ్‌లను చూసేందుకు అభిమానులకు అనుమతినివ్వబోతున్నారు. టెస్ట్‌ మ్యాచ్‌లు జరిగే వేదికలలో ఆయా ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రేక్షకులను అనుమతించబోతున్నారు. డిసెంబర్‌ 17 నుంచి 21 వరకు […]

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ : స్టేడియంలలో ప్రేక్షకులకు అనుమతి
Follow us on

కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటి వరకు ప్రేక్షకులు లేని ఖాళీ క్రికెట్‌ స్టేడియంలలో మ్యాచ్‌లు ఆడటం చూశాం కదా! ఇన్నాళ్లకు ప్రేక్షకుల మధ్యన క్రికెట్‌ మ్యాచ్‌లను చూడబోతున్నాం.. ఆస్ట్రేలియా- ఇండియా మధ్య జరగబోయే మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించబోతున్నారు.. ఇందుకోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా ఏర్పాట్లు చేస్తోంది.. మార్చి తర్వాత మొదటిసారి లైవ్‌ మ్యాచ్‌లను చూసేందుకు అభిమానులకు అనుమతినివ్వబోతున్నారు. టెస్ట్‌ మ్యాచ్‌లు జరిగే వేదికలలో ఆయా ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రేక్షకులను అనుమతించబోతున్నారు. డిసెంబర్‌ 17 నుంచి 21 వరకు అడిలైడ్‌ ఓవల్‌లో మొదటి టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతుంది.. ఈ స్టేడియం కెపాసిటీ 54 వేలు.. ఇందులో 50 శాతం అంటే ప్రతి రోజు 27 వేల మంది ప్రేక్షకులకు స్టేడియంలో ప్రవేశం ఉంటుంది.. డిసెంబర్‌ 26 నుంచి 30 వరకు మెల్‌బోర్న్‌లో బాక్సింగ్‌ డే టెస్ట్ మ్యాచ్‌ జరుగుతుంది. ఇందులో కూడా స్టేడియం కెపాసిటీలో సగానికి సగం మందిని మాత్రమే అంటే పాతిక వేల మంది ప్రేక్షకులను అనుమతించేందుకు విక్టోరియా ప్రభతు్వం ఆమోదించింది.. సిడ్నీలో జనవరి ఏడు నుంచి 11 వరకు మూడో టెస్ట్‌ మ్యాచ్‌ జరుగుతుంది.. మొత్తం సామర్థ్యం 46 వేలు అయితే 23 వేల మంది క్రికెట్‌ అభిమానులకు అనుమతి లభిస్తుంది.. బ్రిస్బేన్‌లో జనవరి 15 నుంచి 19 వరకు నాలుగో టెస్ట్ మ్యాచ్‌ జరుగుతుంది.. 30వేల మంది అభిమానులు, లేదా దాని సామర్థ్యంలో 75 శాతం అనుమతించడానికి అక్కడి ప్రభుత్వం అంగీకరించింది..