మావోయిస్టుల కన్నా చాలా డేంజర్ బీజేపీ, పురూలియా ర్యాలీలో నిప్పులు చెరిగిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

| Edited By: Pardhasaradhi Peri

Jan 19, 2021 | 6:30 PM

భారతీయ జనతా పార్టీ మావోయిస్టులకన్నా చాలా డేంజర్ అన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరగోరేవారు..

మావోయిస్టుల కన్నా చాలా డేంజర్ బీజేపీ, పురూలియా ర్యాలీలో నిప్పులు చెరిగిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
Follow us on

భారతీయ జనతా పార్టీ మావోయిస్టులకన్నా చాలా డేంజర్ అన్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరగోరేవారు ఆ పార్టీలోకి వెళ్లవచ్చునని, ఎవరూ ఆపబోరని అన్నారు.  మంగళవారం పురూలియాలో జరిగిన ర్యాలీలో మాట్లాడిన ఆమె.. బీజేపీ ముందు తాము తలవంచబోమన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మీరు ఆ పార్టీకి ఓటు వేశారని, కానీ ఆ పార్టీ ఎంపీ ఒక్కరైనా మిమ్మల్ని విజిట్ చేశారా అని మమత ప్రశ్నించారు. వాళ్ళు ఎన్నికల ముందు హామీలిస్తారని, ఎన్నికలు ముగిశాక అసలు కనిపించరని ఆమె అన్నారు. రాబోయే ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని మమత ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కాషాయ పార్టీ పన్నుతున్న ఎత్తుగడలను అర్థం చేసుకోవాలని దీదీ అన్నారు. ఈ రోజు కూడా బీజేపీ కార్యకర్తలు తృణమూల్ కాంగ్రెస్ వర్గీయులపై రాళ్లతో దాడి చేసిన విషయాన్ని ఆమె పరోక్షంగా ప్రస్తావించారు. బీజేపీలో చేరిన సువెందు అధికారి వంటివారివల్ల అధికార  పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లదని అన్నారు. మమతను నందిగ్రామ్ లో 50 వేల ఓట్ల ఆధిక్యంతో ఓడిస్తానని, అలా కాకపోతే పాలిటిక్స్ నుంచి వైదొలగుతానని సువెందు అధికారి సవాలు చేశారు. అయితే ఈ విధమైన సవాళ్లకు తాము బెదిరేది లేదని మమతా బెనర్జీ అన్నారు.