‘బ్యాంకులకు కుచ్ఛుటోపీ పెట్టిన బీజేపీ మిత్రులు’.. రాహుల్ గాంధీ నిప్పులు

| Edited By: Pardhasaradhi Peri

Apr 28, 2020 | 6:15 PM

భారతీయ బ్యాంకులకు కుచ్ఛుటోపీ పెట్టిన 50 మంది డీఫాల్టర్ల జాబితాను రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన అనంతరం.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పాలక పార్టీలో స్నేహితులు (అస్మదీయులు) ఉన్న కారణంగానే పార్లమెంటుకు తెలియజేయకుండా ఈ విషయాన్ని దాచిపెట్టారని ఆయన ఆరోపించారు. వీరి పేర్లను వెల్లడించాల్సిందిగా తాను కోరగా ఆర్ధిక మంత్రి సమాధానమిచ్చేందుకు నిరాకరించారని ఆయన అన్నారు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు.. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా వంటివారి […]

బ్యాంకులకు కుచ్ఛుటోపీ పెట్టిన బీజేపీ మిత్రులు.. రాహుల్ గాంధీ నిప్పులు
Follow us on

భారతీయ బ్యాంకులకు కుచ్ఛుటోపీ పెట్టిన 50 మంది డీఫాల్టర్ల జాబితాను రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన అనంతరం.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పాలక పార్టీలో స్నేహితులు (అస్మదీయులు) ఉన్న కారణంగానే పార్లమెంటుకు తెలియజేయకుండా ఈ విషయాన్ని దాచిపెట్టారని ఆయన ఆరోపించారు. వీరి పేర్లను వెల్లడించాల్సిందిగా తాను కోరగా ఆర్ధిక మంత్రి సమాధానమిచ్చేందుకు నిరాకరించారని ఆయన అన్నారు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు.. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా వంటివారి పేర్లతో బాటు బీజేపీ ‘మిత్రుల’ పేర్లను కూడా బహిర్గతపరిచిందని రాహుల్ ట్వీట్ చేశారు. సమాచార హక్కు చట్టం కింద సాకేత్ గోఖలే అనే యాక్టివిస్ట్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తును పురస్కరించుకుని ఆర్ బీ ఐ ఈ జాబితాను రిలీజ్ చేసింది. ఈ రుణాలను ప్రభుత్వం మాఫీ చేసిందని రాహుల్ పేర్కొన్నారు. మొత్తం 50 మంది డీఫాల్టర్లు తీసుకున్న రూ. 68,607 కోట్ల ను ప్రభుత్వం మాఫీ చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అలాగే 2014 నుంచి 2019 సెప్టెంబరు వరకు రూ. 6.66 లక్షల రుణాలను కూడా మాఫీ చేసినట్టు ఈ పార్టీ పేర్కొంది.

కాగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడుతూ.. ఈ బడా బాబుల రుణాలను సర్కార్ ఎందుకుమాఫీ చేసిందని ప్రశ్నించారు. ఇది మోదీ ప్రభువైవ ‘డూప్..డిసీవ్…డిపార్ట్’ పాలసీ అని దుయ్యబట్టారు.