దేశంలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం.. పలు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న మహమ్మారి.. కొనసాగుతున్న పరిశోధనలు..

|

Jan 03, 2021 | 1:57 PM

Bird Flu Scare: అసలే  ఒకవైపు కరోనా వైరస్‌తో అల్లాడిపోతుంటే.. మరోవైపు దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం మొదలైంది. మొదట రాజస్థాన్‌లో వెలుగులోకి..

దేశంలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం.. పలు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న మహమ్మారి.. కొనసాగుతున్న పరిశోధనలు..
Follow us on

Bird Flu Scare: అసలే  ఒకవైపు కరోనా వైరస్‌తో అల్లాడిపోతుంటే.. మరోవైపు దేశంలో బర్డ్ ఫ్లూ కలకలం మొదలైంది. మొదట రాజస్థాన్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వ్యాధి.. ఇప్పుడు మధ్యప్రదేశ్‌కు విస్తరించింది. మూడో రోజుల క్రితం ఇండోర్‌లోని మరణించిన కాకులకు బర్డ్ ఫ్లూ సోకినట్లు పరిశోధకులు నిర్ధారించారు. ఇటీవల ఇండోర్‌లో డెలీ కాలేజీ వద్ద భారీగా కాకులు చనిపోతుండటాన్ని గుర్తించారు. వాటి మృతికి హెచ్5ఎన్8 ఏవియన్ ఇన్‌ఫ్ల్యూ‌యెంజా(బర్డ్ ఫ్లూ) కారణమని తేల్చారు. ఈ టైప్ గల వైరస్ ఎంతో ప్రమాదకరమని.. పక్షుల్లో వేగంగా వ్యాప్తి చెందుతుందని చెబుతున్నారు.

ఈ వైరస్ గురించి తెలిసిన వెంటనే ఇండోర్ మున్సిపల్ శాఖ, వెటర్నరీ విభాగం అధికారులు అప్రమత్తమయ్యారు. ఇండోర్‌లోని డెలీ కాలేజీ వద్ద 5 కి.మీ పరిధి వరకు ఎవరూ తిరగకుండా కర్ఫ్యూ విధించారు. ఇప్పటిదాకా సుమారు 96 కాకులు మృతి చెందినట్లు తేల్చారు. వీటి శాంపిళ్లను భోపాల్‌లోని ప్రయోగశాలకు పంపించారు.

గత మూడు రోజులుగా భారీగా చనిపోతున్న కాకుల శాంపిళ్లను పరీక్షించగా.. రెండింటిలో హెచ్5ఎన్8 వైరస్ లక్షణాలు కనిపించినట్లు ఇండోర్‌లోని జూపార్కుకు చెందిన వైద్యులు ఉత్తమ్ యాదవ్ తెలిపారు. అలాగే రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఒకే రోజు 53 నెమళ్లు మృతి చెందటం ఆందోళనకు గురి చేస్తోంది. అటు ఝూలావాద్‌లో 16 కాకులు, పన్వార్‌లో 10, సునేల్‌లో 8 కాకులు బర్డ్ ఫ్లూ వల్ల మృతి చెందినట్లు గుర్తించారు. దీనితో ఆయా ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ ప్రోటోకాల్‌ను అధికారులు అమలులోకి తీసుకొచ్చారు.