Jagan decision ప్రతీ ఆరోగ్య కేంద్రానికి ఓ బైక్.. ఎందుకంటే?

|

May 14, 2020 | 5:40 PM

ఏపీలో ప్రస్తుతం వున్న ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక్కో బైక్ చొప్పున కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖాధికారులకు ముఖ్యమంత్రి....

Jagan decision ప్రతీ ఆరోగ్య కేంద్రానికి ఓ బైక్.. ఎందుకంటే?
Follow us on

AP CM Jagan is to allocate a bike to every primary health center: ఏపీలో ప్రస్తుతం వున్న ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒక్కో బైక్ చొప్పున కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖాధికారులకు ముఖ్యమంత్రి గురువారం నాడు ఉత్తర్వులు జారీచేశారు. జులై ఒకటో తేదీ కల్లా రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఒక్కో బైక్ చొప్పున కొనుగోలు చేయాలని సీఎం తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గురువారం మధ్యాహ్నం రాష్ట్రంలో అమలవుతున్న టెలిమెడిసిన్‌ విధానాన్ని ముఖ్యమంత్రి సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. 2020 జూలై 1వ తేదీ నాటికి ప్రతి పీహెచ్‌సీకీ ఒక బైక్‌ అందజేయాలని సీఎం ఆదేశించారు. టెలీమెడిసిన్‌ను మరింత పటిష్టం చేసే చర్యల్లో భాగంగా ప్రతి పీహెచ్‌సీకి ఒక బైక్‌ ఇవ్వడం అనివార్యమని సీఎం అభిప్రాయపడ్డారు. అదే రోజు అంటే జులై ఒకటో తేదీన 108,104 అంబులెన్స్‌లతోపాటు 1060 నెంబర్ వైద్య సౌకర్యాలను ప్రారంభించాలని ఆయన తెలిపారు.

టెలిమెడిసిన్‌ ద్వారా ప్రిస్కిప్షన్‌ ప్రకారం మందులు డోర్‌ డెలివరీ చేయడానికే బైక్‌ల వినియోగించాలని సీఎం నిర్దేశించారు. ఈనెల 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించే నాటికి మార్కెట్‌ ఇంటెలిజెన్స్, ప్రొక్యూర్‌మెంట్‌కోసం ఉద్దేశించిన యాప్‌ అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. దీనిపై కొత్తగా నియమించిన జేసీలకు శిక్షణ ఇస్తామని అధికారులు చెబుతున్నారు.