బీహార్ ఎన్నికలు, లీడింగ్ లో మహాఘట్ బంధన్ , ఎన్డీయే మధ్య పోటాపోటీ

| Edited By: Anil kumar poka

Nov 10, 2020 | 11:22 AM

బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 55 సెంటర్లలో ప్రారంభమైంది. మొదట తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, (విపక్ష కూటమి మహాఘట్ బంధన్) ఆధిక్యంలో ఉన్నట్టు కనిపించినప్పటికీ,

బీహార్ ఎన్నికలు, లీడింగ్ లో మహాఘట్ బంధన్ , ఎన్డీయే మధ్య పోటాపోటీ
Follow us on

బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 55 సెంటర్లలో ప్రారంభమైంది. మొదట తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, (విపక్ష కూటమి మహాఘట్ బంధన్) ఆధిక్యంలో ఉన్నట్టు కనిపించినప్పటికీ, మెల్లగా బీజేపీ,జెడి-యూ కూటమి కూడా పుంజుకుంది. ఉదయం పదిన్నర గంటల సమయానికి ఎన్డీయే 107, మహాఘట్ బంధన్ 103 స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నాయి. 243 స్థానాలకు గాను 104 సీట్ల తొలి ట్రెండ్ ను బట్టి చూస్తే..ఎన్డీయే 52, బీజేపీ 28, వికాస్ శీల్ 4 స్థానాల్లో లీడ్ లో కొనసాగాయి. 46 స్థానాల్లో మహాఘట్ బంధన్ లీడ్ లో ఉంది. ఆర్జేడీ 29, కాంగ్రెస్ 12, లెఫ్ట్ 5, బీ ఎస్ పీ 2 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి.  చిరాగ్ పాశ్వాన్ ఆధ్వర్యంలోని లోక్ జనశక్తి పార్టీ కేవలం మూడు సీట్లలో ఆధిక్యంలో ఉంది.