మరో ఇండియన్-అమెరికన్ కి పదవి నిచ్చిన జో బైడెన్, ఎకనమిక్ కౌన్సిల్ సభ్యుడిగా భరత్ రామమూర్తి నియామకం, ఇక యూఎస్ ఎకానమీ పరుగులు

| Edited By: Pardhasaradhi Peri

Dec 22, 2020 | 3:49 PM

అమెరికా అధ్యక్షుడు కానున్న  జో బైడెన్ మరో ఇండియన్-అమెరికన్ కి పదవినిచ్చారు. నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ సభ్యునిగా భరత్ రామమూర్తిని నియమించారు.  కౌన్సిల్ లోని ముగ్గురు సభ్యుల్లో..

మరో ఇండియన్-అమెరికన్ కి పదవి నిచ్చిన జో బైడెన్, ఎకనమిక్ కౌన్సిల్ సభ్యుడిగా భరత్ రామమూర్తి నియామకం, ఇక యూఎస్ ఎకానమీ పరుగులు
Follow us on

అమెరికా అధ్యక్షుడు కానున్న  జో బైడెన్ మరో ఇండియన్-అమెరికన్ కి పదవినిచ్చారు. నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ సభ్యునిగా భరత్ రామమూర్తిని నియమించారు.  కౌన్సిల్ లోని ముగ్గురు సభ్యుల్లో ఈయన కూడా ఒకరు. దేశీయ, అంతర్జాతీయ ఎకనమిక్ పాలసీ రూపకర్తల్లో రామమూర్తి కూడా ఒకరయ్యారు. ఈ పాలసీ విభాగంలో జోయెల్ గాంబేల్, డేవిడ్ కెమిన్ కూడా ఉన్నారు. రూజ్ వెల్ట్ ఇన్స్ టిట్యూట్ లో కార్పొరేట్ పవర్ ప్రోగ్రామ్ ఎండీగా ఉన్న రామమూర్తి పలు పదవులు చేపట్టారు. లోగడ ఎంపీ  ఎలిజెబెత్ వారెన్ కి ఎకనామిక్ అడ్వైజర్ గా వ్యవహరించారు. మసాచ్యూసెట్స్ లో పుట్టిన ఈయన హార్వర్డ్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు. అమెరికాను ఆర్థికంగా పటిష్టపరచడంలో రామమూర్తి వంటివారి సేవలు, వారి ప్రతిభ ఎంతగానో ఉపయోగపడతాయని జో బైడెన్ అన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కానున్న కమలా హారిస్ కూడా వీరిని సీజన్డ్ పబ్లిక్ సర్వెంట్స్ గా అభివర్ణించారు. ఈ ఆర్ధిక సంక్షోభం నుంచి దేశాన్ని ఎలా గట్టెకించాలన్న దానిపై వీరికి మంచి అనుభవం, అవగాహన ఉన్నాయని ఆమె చెప్పారు.

ఇక తన పట్ల విశ్వాసం ఉంచి ఎకనమిక్ కౌన్సిల్ సభ్యునిగా నియమించినందుకు భరత్ రామమూర్తి…బైడెన్-హారిస్ లకు కృతజ్ఞతలు తెలిపారు. దేశాన్ని ఆర్థికంగా పటిష్ట పరచేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.