ఈనెల 8 నుంచి భక్తులకు భద్రాద్రి రాములోరి దర్శనం..!

లాక్ డౌన్ కారణంగా భక్తుల దర్శనాలకు దూరంగా ఉన్న ఆలయాలు జూన్ 8వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. భద్రాద్రి రామాలయంలో ఈనెల 8 నుంచి భక్తులకు భద్రాద్రి రామయ్యస్వామి పునః దర్శనం.

ఈనెల 8 నుంచి భక్తులకు భద్రాద్రి రాములోరి దర్శనం..!
Follow us

|

Updated on: Jun 05, 2020 | 9:31 PM

లాక్ డౌన్ కారణంగా భక్తుల దర్శనాలకు దూరంగా ఉన్న ఆలయాలు జూన్ 8వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. భద్రాద్రి రామాలయంలో ఈనెల 8 నుంచి భక్తులకు భద్రాద్రి రామయ్యస్వామి పునః దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మార్చి 20 నుంచి ఇప్పటి వరకు ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. లాక్‌డౌన్‌ కాలంలో ఆలయ అర్చకులు మాత్రం నిరాడంబరంగా స్వామివారికి పూజలు నిర్వహించారు. పరిమిత సంఖ్యలో ఆన్‌లైన్‌ పూజలు కూడా కొనసాగించారు. లాక్ డౌన్ సడలింపులతో స్వామి వారి దర్శనం ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తులు కొవిడ్ 19 నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో భద్రాద్రి రామాలయం, పర్ణశాల రామాలయంలోని హుండీల్లో నగదు లెక్కిస్తున్నట్లు ఆలయ ఈవో నర్సింహులు తెలిపారు. శ్రీరాములోరి దర్శనాలు ప్రారంభకావడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.