బెస్ట్ ఫీచర్స్ తో బడ్జెట్ ఫోన్

|

Aug 24, 2020 | 5:37 PM

అమెరికాకు చెందిన స్మార్ట్ ఫోన్స్ తయారీ దిగ్గజం మోటొరోలా సరికొత్త బడ్జెట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది. మోటో G8 తర్వాతి వెర్షన్ గా ఈ సరికొత్త మోటో G9 ని..

బెస్ట్ ఫీచర్స్ తో బడ్జెట్ ఫోన్
Follow us on

అమెరికాకు చెందిన స్మార్ట్ ఫోన్స్ తయారీ దిగ్గజం మోటొరోలా సరికొత్త బడ్జెట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది. మోటో G8 తర్వాతి వెర్షన్ గా ఈ సరికొత్త మోటో G9 ని తయారుచేశారు. 4 GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ ఉండే ఒకే వేరియంట్ ను మార్కెట్లోకి వదులుతున్నారు. దీని ధరను రూ. 11,499గా నిర్ణయించారు. ఫారెస్ట్ గ్రీన్, సఫైర్ బ్లూ కలర్స్ లో ఈ ఫోన్ లభ్యమవుతుంది. రెడ్ మీ నోట్ 9 pro , శాంసంగ్ గెలాక్సీ M21, రియల్ మీ 6 I లకు పోటీగా ఈ ప్రొడక్ట్ ను తీసుకొస్తున్నారు. ఫ్లిప్ కార్ట్ లో ఆగస్టు 31వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్ సేల్ మొదలవుతుంది.

మోటో G9 బడ్జెట్ ఫోన్ ప్రత్యేకతలు :

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు..
(క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ 48 మెగా పిక్సెల్ సామర్థ్యం గల ప్రధాన కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో షూటర్ లు కూడా ఇందులో ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఆటో స్మైల్ క్యాప్చర్, HDR, ఫేస్ బ్యూటీ, మాన్యువల్ మోడ్, రా ఫొటో అవుట్ పుట్ వంటి ఫీచర్లు ఇందులో అందిస్తున్నారు. 0.91 సెంటీమీటర్ల మందం, 200 గ్రాముల బరువుతో ఈ ఫోన్ రూపొందింది. ఇంకా..

6.5 అంగుళాల HD +మ్యాక్స్ విజన్ TFT డిస్ ప్లే
ఫింగర్ ప్రింట్ సెన్సార్
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
20W ఫాస్ట్ చార్జింగ్
4GB ర్యామ్
64 జీబీ స్టోరేజ్.. దీనిని మైక్రో SD కార్డు ద్వారా 512 జీబీ పెంచుకునే అవకాశం
ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం
ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్
4జీ వోల్టే,  వైఫై
బ్లూటూత్ 5.0
జీపీఎస్/ఏ-జీపీఎస్
NFC
3.5 MM హెడ్ ఫోన్ జాక్
USB టైప్-సీ పోర్టు కనెక్టివిటీ