రైతు చట్టాలకు మేమూ వ్యతిరేకం, తీర్మానాన్ని ఆమోదించిన బెంగాల్ అసెంబ్లీ, బీజేపీ నిరసన

| Edited By: Anil kumar poka

Jan 28, 2021 | 5:32 PM

కేంద్రం తెచ్చిన మూడు వివాదాస్పద చట్టాలను వ్యతిరేకిస్తూ బెంగాల్ అసెంబ్లీ గురువారం తీర్మానాన్ని ఆమోదించింది.

రైతు చట్టాలకు మేమూ వ్యతిరేకం, తీర్మానాన్ని ఆమోదించిన బెంగాల్ అసెంబ్లీ, బీజేపీ నిరసన
Follow us on

కేంద్రం తెచ్చిన మూడు వివాదాస్పద చట్టాలను వ్యతిరేకిస్తూ బెంగాల్ అసెంబ్లీ గురువారం తీర్మానాన్ని ఆమోదించింది. ఈ చర్య తీసుకున్న  నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆరోదయింది. ఈ తీర్మానాన్ని ప్రభుత్వం సభలో ప్రవేశపెడుతున్నప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు రభసకు  దిగారు. నినాదాలు చేస్తూ తమ నేత మనోజ్ టిగ్గా ఆధ్వర్యంలో వారు వెల్ లోకి దూసుకుపోయారు. ఆ తరువాత సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ చట్టాలురైతులకు వ్యతిరేకమైనవని, కార్పొరేట్లకు అనుకూలమని అంటూ రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పార్థా ఛటర్జీ దీన్ని ప్రవేశపెట్టారు. కాగా లెఫ్ట్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో తీర్మానం సభ ఆమోదం పొందింది.

కేంద్రం బలప్రయోగంతో ఈ చట్టాలను తెచ్చిందని సీఎం మమతా బెనర్జీ ఈ సందర్భంగా ఆరోపించారు. రైతులను దేశ ద్రోహులుగా అభివర్ణించడాన్ని తాము సహించబోమన్నారు. పంజాబ్,  చత్తీస్ గఢ్,   రాజస్తాన్, కేరళ, ఢిల్లీ రాష్ట్రాల అసెంబ్లీలు ఇదివరకే ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానాలను ఆమోదించాయి.
Read More:#AmitShah : దక్షిణాదిపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. అమిత్ షాకు తమిళుల ఘన స్వాగతం..
Read More:భాగ్యనగర్‌ బస్తీల్లో ప్రచార జోరు.. కారుకు ధీటుగా కమలనాథుల రోడ్ షోలు.. రంగంలోకి బీజేపీ అగ్రనేత అమిత్ షా..!