సంయమనంతో వ్యవహరించండి, కార్యకర్తలకు తేజస్వి యాదవ్ పిలుపు

| Edited By: Pardhasaradhi Peri

Nov 08, 2020 | 7:24 PM

బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున తమ పార్టీ కార్యకర్తలు సంయమనంతో, క్రమశిక్షణతో వ్యవహరించాలని, బాణా సంచా కాల్చడం వంటివి చేయరాదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పిలుపునిచ్చారు.  ఫలితం ఎలా ఉన్నా ఆవేశానికి లోను కారాదన్నారు. ఈ నెల 10 న ఓట్ల లెక్కింపు జరుగుతున్న సంగతి విదితమే. ఆ రోజున అంతా శాంతియుతంగా ఉండాలని తేజస్వి కోరారు. రౌడీ బిహేవియర్ తగదు.. ఆర్భాటాలు, ప్రదర్శనలు వద్దు అని ఆయన సూచించారు. ఈ ఎన్నికల్లో తేజస్వి […]

సంయమనంతో వ్యవహరించండి, కార్యకర్తలకు తేజస్వి యాదవ్ పిలుపు
Follow us on

బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున తమ పార్టీ కార్యకర్తలు సంయమనంతో, క్రమశిక్షణతో వ్యవహరించాలని, బాణా సంచా కాల్చడం వంటివి చేయరాదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పిలుపునిచ్చారు.  ఫలితం ఎలా ఉన్నా ఆవేశానికి లోను కారాదన్నారు. ఈ నెల 10 న ఓట్ల లెక్కింపు జరుగుతున్న సంగతి విదితమే. ఆ రోజున అంతా శాంతియుతంగా ఉండాలని తేజస్వి కోరారు. రౌడీ బిహేవియర్ తగదు.. ఆర్భాటాలు, ప్రదర్శనలు వద్దు అని ఆయన సూచించారు. ఈ ఎన్నికల్లో తేజస్వి నేతృత్వంలోని ఆర్జేడీ దే విజయమని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి.