బాలయ్య.. మరోసారి రచ్చ లేపాడు కదా..! ట్రైలర్ సూపర్..!

| Edited By:

Dec 08, 2019 | 9:31 AM

ఎంతో కాలం నుంచి వేయిట్‌ బాలయ్య బాబు ఫ్యాన్స్‌‌కు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుతం బాలయ్య చేస్తోన్న 105వ సినిమా ‘రూలర్’. ఈ సినిమాకి.. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించగా.. నిర్మాతగా.. సీ కల్యాణ్ వ్యవహరించారు. ఈ సినిమాలో.. సోనాల్ చౌహన్, వేదికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అందులోనూ.. ఈ సినిమాలో.. బాలయ్య పాత్ర చాలా ఆసక్తిగా ఉంది. ముందు చాలా స్లిమ్‌గా గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించిన బాలయ్య.. […]

బాలయ్య.. మరోసారి రచ్చ లేపాడు కదా..! ట్రైలర్ సూపర్..!
Follow us on

ఎంతో కాలం నుంచి వేయిట్‌ బాలయ్య బాబు ఫ్యాన్స్‌‌కు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుతం బాలయ్య చేస్తోన్న 105వ సినిమా ‘రూలర్’. ఈ సినిమాకి.. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించగా.. నిర్మాతగా.. సీ కల్యాణ్ వ్యవహరించారు. ఈ సినిమాలో.. సోనాల్ చౌహన్, వేదికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అందులోనూ.. ఈ సినిమాలో.. బాలయ్య పాత్ర చాలా ఆసక్తిగా ఉంది. ముందు చాలా స్లిమ్‌గా గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించిన బాలయ్య.. ఆ తరువాత.. పోలీస్ పాత్రలో కనిపించి.. అభిమానులను అలరించారు.

ట్రైలర్ టాక్: యాక్షన్‌ ఎలిమెంట్‌తో మరోసారి దుమ్ములేపాడు బాలయ్య. సినిమాలోని.. ఒక్కో ఎలివెంట్‌ను.. ఎలివేట్ చేశారు. సెంటిమెంట్, యాక్షన్, కోపం, ఆవేశం, హాస్యం ఇలా అన్నింటినీ ట్రైలర్‌లో చూపించారు. ఈ ట్రైలర్‌లో.. ఉన్న దాని ప్రకారం.. బాలయ్యకు గతం.. ప్రస్తుతం రెండు రకాల క్యారక్టరైజేషన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది.

ఎవరికిరా ఫోన్ చేస్తున్నావ్.. ఫైర్ ఇంజన్‌కా.. లేదు.. ఆ ఫైర్‌కే ఫైర్‌కే ఫోన్ చేస్తున్నా.. అంటూ ట్రైలర్‌లో మొదలైన.. డైలాగ్స్.. కేక పుట్టించాయి. బాలయ్య ఒక పక్క గ్యాంగ్ స్టర్‌ పాత్రలో స్లిమ్‌గా.. పోలీస్ పాత్రలో ఊర మాస్‌గా కనిపించి అలరించారు. ఇక ప్రకాష్ రాజ్, భూమిక, జయసుధ, హీరోయిన్స్ వేదిక, సోనాల్.. అందరూ చక్కగా పలు పాత్రలో కనిపించారు.