డైరెక్టర్ శంకర్ కు భూమి అంశంపై హైకోర్టులో వాదోపవాదాలు

|

Aug 27, 2020 | 6:11 PM

దర్శకుడు శంకర్‌కు భూమిని కేటాయించడంపై ఇవాళ హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు హైకోర్టులో సవాలు చేసిన నేపథ్యంలో..

డైరెక్టర్ శంకర్ కు భూమి అంశంపై హైకోర్టులో వాదోపవాదాలు
Follow us on

దర్శకుడు శంకర్‌కు భూమిని కేటాయించడంపై ఇవాళ హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు హైకోర్టులో సవాలు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైకోర్టు పలు ప్రశ్నలను సంధించింది. ఇతర వ్యక్తులకు స్థలాలు ఇవ్వకుండా ప్రభుత్వమే సొంతంగా సినిమా స్టూడియో నిర్మించవచ్చు కదా? అని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమ ఆక్రమించడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలా విలువైన భూములను సినీ ప్రముఖుల పేరు చెప్పి కట్టబెట్టడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఇక ధర్మాసనం వ్యాఖ్యలపై స్పందించిన అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌.. కేబినెట్‌ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. దీంతో మరోసారి కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.