పోతిరెడ్డిపాడుపై త్వరలో అపెక్స్ భేటీ.. బండికి షెకావత్ లేఖ

|

May 16, 2020 | 2:15 PM

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ అంశాన్ని చర్చించేందుకు త్వరలో అపెక్స్ భేటీ నిర్వహించాలని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును ఆదేశించారు.

పోతిరెడ్డిపాడుపై త్వరలో అపెక్స్ భేటీ.. బండికి షెకావత్ లేఖ
Follow us on

KRMB apex committee meet on Potireddypadu soon:  రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైన పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ అంశాన్ని చర్చించేందుకు త్వరలో అపెక్స్ భేటీ నిర్వహించాలని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును ఆదేశించారు. ఈ మేరకు ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌కు రాసిన లేఖలో ధృవీకరించారు.

పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా జారీ చేసిన జీవో నంబర్ 203పై తెలంగాణ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు శనివారం నల్లజెండాలను ఎగురవేసి నిరసన తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి 11గంటల మధ్య తమ తమ ఇళ్ళపై నల్ల జెండాలు ఎగురవేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కరీంనగర్‌లోని ఆయన నివాసంలో తన ఇంటిపై నల్ల జెండా ఎగరేసి నిరసన తెలిపారు బండి సంజయ్. అనంతరం ఆయన మొబైల్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడారు.

ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జివో నెంబర్ 203 కారణంగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు లేఖ రాసామని తెలిపారు. దానికి ఆయన స్పందించారని సంజయ్ వివరించారు. తక్షణమే అఫెక్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కేఆర్ఎంబిని కేంద్ర మంత్రి షెకావత్ ఆదేశించారని తెలిపారు. ఇది తెలంగాణ బీజేపీ శాఖ చేసిన ప్రయత్నానికి ఫలితంగా భావిస్తున్నామని సంజయ్ అంటున్నారు.

పోతిరెడ్డిపాడు నీటి ఎత్తిపోతల సామర్ధ్యం పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ కు అన్యాయం చేసేలా కుట్రలు పన్నుతుందని సంజయ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తే సహించేది లేదని ఆయన తెలిపారు. అపెక్స్ కమిటీ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం, అధికారులు తమ వాదనను సమర్థవంతంగా వినిపించి తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించాలని సంజయ్ డిమాండ్ చేశారు.

Read this: కరోనా కంటే కరెంటు షాకే డేంజర్… జగన్ సర్కార్‌పై జనసేన విమర్శ  

Read this: వలస కూలీలపై విరిగిన లాఠీ.. తాడేపల్లిలో దారుణం

Read this: ఉమ్మెత్త తింటే కరోనా రాదట..! చివరికి ఏమైందంటే?