చంద్రబాబుపై మంత్రుల ముప్పేటదాడి

|

Sep 15, 2020 | 8:30 PM

అధికారాన్ని అడ్డంపెట్టుకొని రాజధాని అమరావతిలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ బడా నేతలంతా భారీ భూ కుంభకోణానికి తెరతీశారంటూ ఏపీ మంత్రులు ముప్పేటదాడికి దిగారు. అమరావతిలో టీడీపీ నేతలు..

చంద్రబాబుపై మంత్రుల ముప్పేటదాడి
Follow us on

అధికారాన్ని అడ్డంపెట్టుకొని రాజధాని అమరావతిలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ బడా నేతలంతా భారీ భూ కుంభకోణానికి తెరతీశారంటూ ఏపీ మంత్రులు ముప్పేటదాడికి దిగారు. అమరావతిలో టీడీపీ నేతలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేశారని పూర్తి ఆధారాలతో నివేదిక ఇచ్చామని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత తమపై ఉందన్న కన్నబాబు.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్టు కక్షసాధింపే అయితే విచారణ లేకుండానే కేసులు పెట్టేవాళ్లం కదా? అంటూ వ్యాఖ్యానించారు. మరో మంత్రి చెల్లుబోయిన కూడా ఇలాంటి వ్యాఖ్యలే సంధించారు. రాజధాని అమరావతిలో భారీగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే విషయాన్ని మంత్రివర్గ ఉప సంఘం కూడా నిర్ధారించిందని చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. రాజధాని భూముల వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని, అప్పుడే వాస్తవాలు ప్రజల ముందుకు వస్తాయని అభిప్రాయపడ్డారు. బినామీ పేర్లతో టీడీపీ నాయకులు రాజధానిలో భూములు కాజేశారని.. అసైన్డ్ భూములు, ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కూడా ఉల్లంఘించారని ఆరోపించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. అమరావతిలో ఎక్కడ చూసినా భూ కుంభకోణాలే. రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారు.. టీడీపీ నేతలు దళితుల భూములు కూడా దోచుకున్నారు. భూములను టీడీపీ నేతలు, బినామీలే కొనుగోలు చేశారంటూ ఆరోపించారు.