రామతీర్థం కోదండరామాలయంలో కొనసాగుతున్న వివాదం.. ఇవాళ విగ్రహాలను పరిశీలనకు రాష్ట్ర మంత్రులు

| Edited By: Pardhasaradhi Peri

Jan 03, 2021 | 9:34 AM

మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపలి శ్రీనివాస్ రామతీర్థం కొండపై విగ్రహ ధ్వంసం ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు.

రామతీర్థం కోదండరామాలయంలో కొనసాగుతున్న వివాదం.. ఇవాళ విగ్రహాలను పరిశీలనకు రాష్ట్ర మంత్రులు
Follow us on

విజయనగరం జిల్లాలోని రామతీర్థం బోడికొండపై నున్న కోదండరామాలయంలోని రాముడి విగ్రహం ధ్వంసం ఘటనతో రాజకీయాలు హీటెక్కాయి. బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం నిరసన తెలిపిన నేపథ్యంలో.. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రులు రామతీర్థంలో పర్యటించనున్నారు. మరికాసేపట్లో మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపలి శ్రీనివాస్ రామతీర్థం కొండపై విగ్రహ ధ్వంసం ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి బాధ్యులైన వారిపై ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. రామతీర్థం కోదండరామాలయం ఈవో కిశోర్‌ను హెడ్ క్వార్టర్ట్స్ కి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ధరకర్తగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజును చైర్మన్ పదవి నుంచి తొలగించింది రాష్ట్ర సర్కార్.