ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. శ్రీశైలం రిజర్వాయర్‌ నీటి నిల్వ సామర్థ్యం తేల్చే బాధ్యత సీడబ్ల్యూసీకి అప్పగింత

|

Jan 02, 2021 | 1:30 PM

శ్రీశైలం జలాశయం పూడికతీత అధ్యయన బాధ్యతలు కేంద్ర జలసంఘంకు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం.

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. శ్రీశైలం రిజర్వాయర్‌ నీటి నిల్వ సామర్థ్యం తేల్చే బాధ్యత సీడబ్ల్యూసీకి అప్పగింత
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం జలాశయంలో పేరుకుపోయిన పూడికతీత పనులకు సంబంధించి సమగ్ర అధ్యయన బాధ్యతను కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం జలాశయానికి వరదతోపాటు పూడిక కూడా పోటెత్తుతోంది. రిజర్వాయర్‌ జలవిస్తరణ ప్రాంతంలో సగటున వంద అడుగుల ఎత్తున కొండలా పూడిక చేరడంతో నిల్వ సామర్థ్యం ఏటా తగ్గిపోతోంది. అయితే, ఇప్పుడు నిల్వ సామర్థ్యం మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అయితే, గత సోమవారం అకౌస్టిక్‌ డాప్లర్‌ కరెంట్‌ ప్రొఫైలర్‌(ఏడీసీపీ) పరికరంతో హైడ్రోమెట్రిక్‌ సర్వే నిర్వహించగా పూడిక మరింత పేరుకుపోయినట్లు తేలింది. ఈ నేపథ్యంలో దీనిపై సమగ్ర అధ్యయన బాధ్యతను కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)కి అప్పగించాలని నిర్ణయించారు. నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఆయకట్టుకు నీళ్లలందించడం పెద్ద సవాల్‌గా మారుతోంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో పూడిక వల్ల నిల్వ సామర్థ్యం ఇప్పటికే 308.06 టీఎంసీల నుంచి 215.81 టీఎంసీలకు పడిపోయిందని నిపుణులు చెబుతన్నారు. దీంతో రిజర్వాయర్‌ నీటి నిల్వ సామర్థ్యం తేల్చే బాధ్యతను సీడబ్ల్యూసీకి అప్పగించారు.