యాంటీ లవ్ జిహాద్ చట్టంపై తొందరెందుకు ? పునరాలోచన చేయాలన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి

బలవంతపు మత మార్పిడుల (యాంటీ లవ్ జిహాద్) నిరోధక చట్టాన్ని తొందరబాటుతో తెచ్చారని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి యూపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. దీనిపై పునరాలోచన చేయాలని ఆమె కోరారు. యూపీ గవర్నర్ జారీ చేసిన..

యాంటీ లవ్ జిహాద్ చట్టంపై తొందరెందుకు ? పునరాలోచన చేయాలన్న బీఎస్పీ అధినేత్రి మాయావతి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 30, 2020 | 3:10 PM

బలవంతపు మత మార్పిడుల (యాంటీ లవ్ జిహాద్) నిరోధక చట్టాన్ని తొందరబాటుతో తెచ్చారని బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి యూపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. దీనిపై పునరాలోచన చేయాలని ఆమె కోరారు. యూపీ గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్స్  గత శనివారంనుంచే అమలులోకి రాగా..ఈ చట్టంకింద అప్పుడే ఓ కేసు కూడా నమోదయింది. అయితే ఇది పలు సందేహాలకు తావిస్తోందని, దేశంలో ఎక్కడా బలవంతంగా గానీ, మోసపూరితంగా గానీ మతమార్పిడులు జరుగుతున్న దాఖలాలు లేవని, పైగా ఇది ఆమోదయోగ్యం కూడా కాదని మాయావతి అన్నారు. ఇప్పటికే ఈ విధమైన పలు చట్టాలు ఉన్నాయన్నారు. లవ్ జిహాద్ అన్న పదమే అభ్యంతరకరంగా ఉందని అభిప్రాయపడ్డారు.

యూపీలోని బెరైలీ జిల్లాలో ఓ ముస్లిం వ్యక్తి హిందూ మహిళనొకరిని ఇస్లాం మతంలోకి మారవలసిందిగా బలవంతంగా ఒత్తిడి చేసినట్టు వార్తలు రావడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అదే రోజున గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఈ ఆర్డినెన్స్ జారీ చేశారు. పెళ్లి పేరిట హిందూ మహిళలను మోసగించి ఆ తరువాత వారిని మతం మార్చుకోవాలని ఒత్తిడి చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు యూపీ అప్పుడే ఇలా ఓ చట్టం తేగా, బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాలు కూడా ఇదే విధమైన చట్టాన్ని తెచ్చే యోచనలో ఉన్నాయి.