సింఘు బోర్డర్ లో కొనసాగుతున్న రైతుల నిరసన, చలికి తట్టుకోలేక మరో అన్నదాత మృతి

| Edited By: Anil kumar poka

Dec 17, 2020 | 12:46 PM

ఢిల్లీ-హర్యానాలోని సింఘు బోర్డర్ లో ఆందోళన చేస్తున్న రైతుల్లో మరో అన్నదాత గురువారం ఉదయం మరణించాడు. తీవ్రమైన చలికి తట్టుకోలేక ఈయన మరణించినట్టు తెలుస్తోంది. ముగ్గురు పిల్లల తండ్రి అయిన ఈ రైతు పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు.

సింఘు బోర్డర్ లో కొనసాగుతున్న రైతుల నిరసన, చలికి తట్టుకోలేక మరో అన్నదాత మృతి
Follow us on

ఢిల్లీ-హర్యానాలోని సింఘు బోర్డర్ లో ఆందోళన చేస్తున్న రైతుల్లో మరో అన్నదాత గురువారం ఉదయం మరణించాడు. తీవ్రమైన చలికి తట్టుకోలేక ఈయన మరణించినట్టు తెలుస్తోంది. ముగ్గురు పిల్లల తండ్రి అయిన ఈ రైతు పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు. ఇప్పటివరకు 20 మందికి పైగా రైతులు మృత్యువాత పడ్డారు. ఢిల్లీతో బాటు ఉత్తరాది అంతటా గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా నాలుగైదు డిగ్రీల సెల్సియస్ నమోదవుతోంది. కానీ ఈ గజ గజ వణికించే చలిని తాము ఓర్చుకుంటామని, మా డిమాండ్లు తీరేవరకు ఇక్కడి నుంచి కదలబోమని రైతులు అంటున్నారు. వర్షం పడినా చలించబోమని చెబుతున్నారు. అనేకమంది వలంటీర్ల ఈ ధర్నా స్థలికి చేరుకొని వీరికి హీటర్లు, దుప్పట్లు ఇస్తున్నారు. మరికొందరు అన్నదాతలు చలిమంటలు వేసుకుంటూనే నిరసన కొనసాగిస్తున్నారు.

ఇంతవరకు 20 మంది రైతులు మృతి చెందినా కేంద్రం స్పందించకపోవడాన్ని పలువురు ప్రతిపక్ష నేతలు, మానవతావాదులు కూడా తప్పు పడుతున్నారు. ప్రభుత్వం మంకుపట్టు వీడి మళ్ళీ అన్నదాతలతో సంప్రదింపులు కొనసాగించాలని, వారి న్యాయమైన డిమాండ్లు తీర్చాలని కోరుతున్నారు. వీరి సమస్య పరిష్కారానికి పానెల్ ఏర్పాటు చేయాలని  సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. ఇది జాతీయ సమస్యగా మారక ముందే అరమరికలు, ఇగో లేకుండా వీరితో చర్చలు జరపాలని సూచించింది. అయితే కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఇటీవల సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. అన్నదాతలు తమలో అనేక సంఘాలు ఉన్నాయని, ఆ సంఘాల ప్రతినిధులందరినీ కమిటీలో చేర్చాలని కోరడంతో కేంద్రం వెనక్కి తగ్గింది.