దేశ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సీన్, కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగ్

| Edited By: Anil kumar poka

Oct 26, 2020 | 10:30 AM

దేశ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సీన్ లభిస్తుందని కేంద్ర పశు సంవర్ధక శాఖ సహాయ మంత్రి ప్రతాప్ సారంగ్ ప్రకటించారు. ప్రతి వ్యక్తికీ వ్యాక్సినేషన్ కోసం 500 రూపాయలు ఖర్చవుతుందని అన్నారు.

దేశ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సీన్, కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగ్
Follow us on

దేశ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సీన్ లభిస్తుందని కేంద్ర పశు సంవర్ధక శాఖ సహాయ మంత్రి ప్రతాప్ సారంగ్ ప్రకటించారు. ప్రతి వ్యక్తికీ వ్యాక్సినేషన్ కోసం 500 రూపాయలు ఖర్చవుతుందని అన్నారు. బీహార్ లో ఈ నెల 28 న జరగనున్న ఎన్నికల సందర్భంలో .. బీజేపీ తమ మేనిఫెస్టోలో.. ఫ్రీ వ్యాక్సీన్ హామీ ఇచ్చింది. అయితే ఇది కేవలం బీహారీల కేనా దేశ ప్రజలందరికీ వర్తించదా అని విపక్షాలు సందేహాలు లేవనెత్తాయి.  దీనిపై భువనేశ్వర్ లో మాట్లాడిన ప్రతాప్ సారంగ్..ఈ విషయంలో అనుమానాలు అనవసరమన్నారు. ఒడిశా మంత్రి ఆర్.పీ. స్వేయిన్ స్వయంగా ఈ మేరకు అడిగిన ప్రశ్నకు సారంగ్.. బదులిస్తూ.. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఫ్రీ వ్యాక్సీన్ ఇస్తామని హామీ ఇచ్చాయన్నారు. ఇక దీనిపై ఎలాంటి సందేహాల ప్రస్తావన ఉండరాదన్నారు.