ట్రంప్‌ విజయాన్ని ఆకాంక్షిస్తూ హిందూసేన పూజలు

|

Nov 03, 2020 | 4:33 PM

అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డెమొక్రాట్‌ అభ్యర్థి కమలా హారిస్‌ విజయం కోసం తమిళనాడులో పూజలు చేస్తున్నారంటే అర్థం ఉంది. ఎందుకంటే ఆమె పూర్వీకులు తమిళనాడుకు చెందిన వారు కాబట్టి.. మరి డొనాల్డ్‌ ట్రంప్‌ గెలుపు కోసం హిందూసేన ఢిల్లీలో ప్రత్యేక పూజలు ఎందుకు చేస్తున్నట్టు? అంటే దానికో అర్థం ఉంది.. ఇస్లామిక్‌ రాడికల్స్‌కు వ్యతిరేకంగా ట్రంప్‌ మాట్లాడారు కాబట్టే ఆయన గెలవాలని కోరుకుంటున్నామంటున్నారు హిందూసేన అధ్యక్షుడు విష్ణు గుప్తా.. తూర్పు ఢిల్లీలోని ఓ ఆలయంలో […]

ట్రంప్‌ విజయాన్ని ఆకాంక్షిస్తూ హిందూసేన పూజలు
Follow us on

అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డెమొక్రాట్‌ అభ్యర్థి కమలా హారిస్‌ విజయం కోసం తమిళనాడులో పూజలు చేస్తున్నారంటే అర్థం ఉంది. ఎందుకంటే ఆమె పూర్వీకులు తమిళనాడుకు చెందిన వారు కాబట్టి.. మరి డొనాల్డ్‌ ట్రంప్‌ గెలుపు కోసం హిందూసేన ఢిల్లీలో ప్రత్యేక పూజలు ఎందుకు చేస్తున్నట్టు? అంటే దానికో అర్థం ఉంది.. ఇస్లామిక్‌ రాడికల్స్‌కు వ్యతిరేకంగా ట్రంప్‌ మాట్లాడారు కాబట్టే ఆయన గెలవాలని కోరుకుంటున్నామంటున్నారు హిందూసేన అధ్యక్షుడు విష్ణు గుప్తా.. తూర్పు ఢిల్లీలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.. ఇందులో హిందూసే కార్యకర్తలతో పాటు ట్రంప్‌ మద్దతుదారులు కూడా పాల్గొన్నారు.. అరగంట పాటు పూజలు, హోమాలు సాగాయి.. క్రితంసారి జరిగిన ఎన్నికలప్పుడు కూడా తాము ట్రంప్‌ గెలవాలని ప్రత్యేక పూజలు చేశామన్నారు విష్ణుగుప్తా. ట్రంప్‌ విజయం ప్రపంచానికే కాదని, భారత్‌కు కూడా మేలు చేస్తుందని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్‌, చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఉంది కాబట్టి మనకు మిత్రదేశమేనని గుప్తా తెలిపారు.