జ్యోతిబాపూలే  కాలేజీల్లో అడ్మిషన్లకు.. దరఖాస్తు గడువు పొడిగింపు..

| Edited By:

Jul 14, 2020 | 1:47 AM

తెలంగాణ రాష్ట్రంలో మహాత్మాజ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ బాల బాలికలకు ఇంగ్లీష్‌ మీడియం జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు గడువు పొడిగించినట్టు

జ్యోతిబాపూలే  కాలేజీల్లో అడ్మిషన్లకు.. దరఖాస్తు గడువు పొడిగింపు..
Follow us on

Jyotiba Phule Residential Colleges: తెలంగాణ రాష్ట్రంలో మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ బాల బాలికలకు ఇంగ్లీష్‌ మీడియం జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు గడువు పొడిగించినట్టు విద్యాసంస్థల కార్యదర్శి మల్లయ్యభట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూనియర్‌ కళాశాలలు, మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కొరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 19వ తేదీ వరకూ గడువు పొడిగించినట్టు తెలిపారు.

ఎంట్రన్స్ టెస్ట్ ఎప్పుడు నిర్వహించేది అన్నవిషయం పై విద్యార్ధులకు నేరుగా సమాచారం ఇస్తామన్నారు. అర్హులైన బిసి, ఎస్‌సి, ఎస్‌టి, ఈబీసీ, విద్యార్దినీ, విద్యార్ధులు ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు.