ఏపీ ప్రయాణికులకు శుభవార్త..హైదరాబాద్ నుంచి విజయవాడకు సంక్రాంతి ప్రత్యేక విమానాలు

| Edited By: Pardhasaradhi Peri

Jan 03, 2021 | 9:18 AM

హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేవారికి ప్రత్యేక విమాన సర్వీసులు మొదలు కాబోతున్నాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి సంక్రాంతికి అదనపు సర్వీసులు ఆరంభమవుతున్నాయి.

ఏపీ ప్రయాణికులకు శుభవార్త..హైదరాబాద్ నుంచి విజయవాడకు సంక్రాంతి ప్రత్యేక విమానాలు
Follow us on

Gannavaram Airport to Hyderabad : ఏపీ ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లేవారికి ప్రత్యేక విమాన సర్వీసులు మొదలు కాబోతున్నాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి సంక్రాంతికి అదనపు సర్వీసులు ఆరంభమవుతున్నాయి. ఇప్పటికే స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ సంక్రాంతి రద్దీ కోసం జనవరి 10 నుంచి 31వరకు హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాలను ప్రకటించింది.

జనవరి 10 నుంచి ప్రతిరోజూ సాయంత్రం 4.30కు హైదరాబాద్‌లో బయల్దేరి.. విజయవాడకు విమానం చేరనుంది. అలాగే సాయంత్రం 6 గంటలకు విజయవాడలో బయల్దేరనున్న విమానం రాత్రి 7.10కి హైదరాబాద్‌కు చేరుతుంది. మరికొన్ని విమానయాన సంస్థలు కూడా సంక్రాంతి రద్దీకి అనుగుణంగా సర్వీసులను నడిపే యోచనలో ఉంది. ఈ విమాన సర్వీసుల షెడ్యూల్‌ను తాజాగా స్పైస్‌జెట్‌ విమాన సంస్థ విడుదల చేసింది.

స్పైస్‌జెట్‌ విమాన సర్వీసుల వివరాలు ఇలా…

  • జనవరి 10 నుంచి 31 వరకు ప్రతిరోజు సాయంత్రం 4.30కు హైదరాబాద్‌లో బయలుదేరి ఒక సర్వీసు విజయవాడకు 5.30కు వస్తుంది. తిరిగి విజయవాడ నుంచి సాయంత్రం 6 గంటకు ఇదే సర్వీసు బయలుదేరి హైదరాబాద్‌కు రాత్రి 7.10కి చేరుతుంది.
  • జనవరి 16 నుంచి మరో సర్వీసు విజయవాడలో బయలుదేరుతుంది. జనవరి 30వరకు ఇది నడుస్తుంది. రోజు మధ్యాహ్నం 3.20కు బయలుదేరి 3.55కు హైదరాబాద్‌కు వెళుతుంది.
  • జనవరి 11 నుంచి 28 మరో కొత్త సర్వీసు ఆరంభమవుతుంది. విజయవాడలో మధ్యాహ్నం 3.20కు బయలుదేరి హైదరాబాద్‌కు 4.10కి చేరుతుంది.