ఢిల్లీ ఎయిమ్స్ సెక్యూరిటీ స్టాఫ్ పై దాడి కేసులో ఆప్ ఎమ్మెల్యేకు రెండేళ్ల జైలు శిక్ష, బెయిల్ కూ వెసులుబాటు

| Edited By: Anil kumar poka

Jan 23, 2021 | 3:58 PM

ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసినందుకు ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి ఇక్కడి కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది.

ఢిల్లీ ఎయిమ్స్ సెక్యూరిటీ స్టాఫ్ పై దాడి కేసులో ఆప్ ఎమ్మెల్యేకు రెండేళ్ల జైలు శిక్ష, బెయిల్ కూ వెసులుబాటు
Follow us on

ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసినందుకు ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి ఇక్కడి కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఇది 2016 నాటి కేసుకు సంబందించినది. ఈ ఎమ్మెల్యేపై కోర్టు లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. అయితే ఈ తీర్పుపై హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు ఈయనకు కోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. 2016 సెప్టెంబరు 9 న సోమనాథ్ భారతి సుమారు 300 మందితో వఛ్చి ఎయిమ్స్ బౌండరీ గోడను జేసీబీ ఆపరేటర్ తో కూల్చివేయడమే గాక, అక్కడి సెక్యూరిటీ ఉద్యోగులపై ఎటాక్ కూడా చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అయితే ఈ కేసులో తనను ఇరికించేందుకు పోలీసు అధికారులు, ఇతర సాక్షులు తనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చారని సోమనాథ్ భారతి ఆరోపించారు. ఈ ఎమ్మెల్యే సహనిందితులైన ముగ్గురిని కోర్టు నిర్దోషులుగా వదిలివేసింది.