సైక్లింగ్ లో చాంపియన్ కావాలని రాష్ట్రపతి ఆశీస్సులు..పేద కుర్రాడిలో మెరిసిన ఆశలు

| Edited By: Pardhasaradhi Peri

Aug 01, 2020 | 3:47 PM

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 14 ఏళ్ళ కుర్రాడికి చక్కని రేసింగ్ సైకిల్ ని బహుమతిగా ఇచ్చారు. అంతర్జాతీయ సైక్లింగ్ చాంపియన్ కావాలని అతడిని ఆశీర్వదించారు.  రియాజ్ అనే ఆ బాలుడు రాష్ట్రపతి భవన్ వద్ద ఆనందంగా ఆ సైకిల్ ని ఆయన నుంచి స్వీకరించాడు. బీహార్ లోని మధుబన్ జిల్లాకు చెందిన రియాజ్..2017 లో ఢిల్లీలో జరిగిన సైక్లింగ్ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం సాధించాడు. అంతర్జాతీయ సైక్లింగ్ ఛాంపియన్ కావాలనుకున్నప్పటికీ పేదరికం కారణంగా […]

సైక్లింగ్ లో చాంపియన్ కావాలని  రాష్ట్రపతి ఆశీస్సులు..పేద కుర్రాడిలో మెరిసిన ఆశలు
Follow us on

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 14 ఏళ్ళ కుర్రాడికి చక్కని రేసింగ్ సైకిల్ ని బహుమతిగా ఇచ్చారు. అంతర్జాతీయ సైక్లింగ్ చాంపియన్ కావాలని అతడిని ఆశీర్వదించారు.  రియాజ్ అనే ఆ బాలుడు రాష్ట్రపతి భవన్ వద్ద ఆనందంగా ఆ సైకిల్ ని ఆయన నుంచి స్వీకరించాడు. బీహార్ లోని మధుబన్ జిల్లాకు చెందిన రియాజ్..2017 లో ఢిల్లీలో జరిగిన సైక్లింగ్ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం సాధించాడు. అంతర్జాతీయ సైక్లింగ్ ఛాంపియన్ కావాలనుకున్నప్పటికీ పేదరికం కారణంగా పలు పోటీలను మిస్సయ్యాడు. అతడిని ప్రోత్సహించి స్పాన్సర్ చేసే దాతలు కరువయ్యారు. అయితే ఈ సమాచారం రాష్ట్రపతి భవన్ వర్గాలకు తెలిసింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్….. రియాజ్ ను ఆహ్వానించి అతనికి ఓ రేసింగ్ సైకిల్ ని గిఫ్ట్ గా అందజేశారు. ఈద్ ఉల్ అదా (బక్రీద్) కి ఒకరోజు ముందు  ఈ దేశ ప్రథమ పౌరుడి నుంచి అందిన ఈ బహుమతిని చూసి రియాజ్ ఆనందంతో పొంగిపోయాడు.

ఎన్ని సమస్యలున్నా, పేదరికానికి ఎదురీదుతూనే రియాజ్ తన ఆశల సాధనకు చేస్తున్న కృషిని రాష్ట్రపతి ప్రశంసించారు. భవిష్యత్తులో గొప్ప సైక్లింగ్ ఛాంపియన్ అవతావని అతడికి ఆశీస్సులను అందజేశారు.