భయం గుప్పిట్లో ఆ దేశం.. ఓ వైపు కరోనా.. మరోవైపు భూకంపం..

| Edited By:

Apr 20, 2020 | 2:23 PM

ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం కరోనా మహమ్మారితో వణికిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 23 లక్షల మందికి పైగా ఈ వైరస్‌ సోకింది. వీరిలో లక్షన్నర మందికి పైగా ఇది పొట్టనపెట్టుకుంది. అయితే జపాన్‌ దేశంలో కూడా ప్రస్తుతం కరోనా విజృంభిస్తోంది. దీంతో దేశంలో లాక్‌డౌన్‌ విధించారు. ఇప్పటికే కరోనాతో వణికిపోతున్న జనంపై ఇప్పుడు ప్రకృతి కూడా పగబట్టినట్లుంది. సోమవారం ఉదయం జపాన్‌లో భూకంపం సంభవించింది. దేశంలోని మియాగీ ప్రాంతంలో.. ఉదయం భూప్రకంపనలు వచ్చినట్లు జపాన్ అధికారులు తెలిపారు. […]

భయం గుప్పిట్లో ఆ దేశం.. ఓ వైపు కరోనా.. మరోవైపు భూకంపం..
Earthquake
Follow us on

ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం కరోనా మహమ్మారితో వణికిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 23 లక్షల మందికి పైగా ఈ వైరస్‌ సోకింది. వీరిలో లక్షన్నర మందికి పైగా ఇది పొట్టనపెట్టుకుంది. అయితే జపాన్‌ దేశంలో కూడా ప్రస్తుతం కరోనా విజృంభిస్తోంది. దీంతో దేశంలో లాక్‌డౌన్‌ విధించారు. ఇప్పటికే కరోనాతో వణికిపోతున్న జనంపై ఇప్పుడు ప్రకృతి కూడా పగబట్టినట్లుంది. సోమవారం ఉదయం జపాన్‌లో భూకంపం సంభవించింది. దేశంలోని మియాగీ ప్రాంతంలో.. ఉదయం భూప్రకంపనలు వచ్చినట్లు జపాన్ అధికారులు తెలిపారు. ఈ భూకంప తీవ్ర రిక్టర్ స్కేలుపై 6.1 గా నమోదైనట్లు తెలుస్తోంది. ఈ భూకంపంతో దేశ రాజధాని టోక్యో కూడా వణికిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. అయితే ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావోద్దని.. దీని ద్వారా సునామీ ముప్పు ఏం లేదని స్పష్టం చేశారు.