దేశంలో.. 24 గంటల్లో 505 కొత్త కరోనా కేసులు

| Edited By:

Apr 05, 2020 | 10:23 PM

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో 505 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

దేశంలో.. 24 గంటల్లో 505 కొత్త కరోనా కేసులు
Follow us on

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో 505 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఈ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ 203 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,577కి చేరింది. ఇప్పటి వరకు 83 మంది మరణించారు. వీరిలో 3,217 మందికి చికిత్స కొనసాగుతోందని, 274 మందిని డిశ్చార్జ్‌ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

కాగా.. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఏపీలో కొత్తగా ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకూ 26 కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 252కు చేరింది. తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 302కి చేరింది.