Gas Leakage at IFFCO: ఉత్తర్‌ప్రదేశ్‌లో గ్యాస్ లీకేజీ… ఇద్దరు మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం…

| Edited By:

Dec 23, 2020 | 9:00 AM

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని పూల్పూర్ ఐఎఫ్ఎఫ్‌సీఓ‌(ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కో ఆపరేటివ్ లిమిటెడ్) ప్లాంట్‌లో గ్యాస్ లీకేజీ అయ్యింది.

Gas Leakage at IFFCO: ఉత్తర్‌ప్రదేశ్‌లో గ్యాస్ లీకేజీ... ఇద్దరు మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం...
Follow us on

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని పూల్పూర్ ఐఎఫ్ఎఫ్‌సీఓ‌(ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కో ఆపరేటివ్ లిమిటెడ్) ప్లాంట్‌లో గ్యాస్ లీకేజీ అయ్యింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లు ప్రయాగ్‌రాజ్ ఎండీ భాను చంద్ర గోస్వామి తెలిపారు. ప్రమాదానికి కారణమైన ప్లాంటును మూసి వేసినట్లు ప్రకటించారు. కాగా ఈ విషాదకర ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ విచారం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మొత్తం ఘటనపై సమగ్ర విచారణ చేపడుతున్నట్లు ప్రకటించారు.