వయసు 105, చదివేది 4వ తరగతి

| Edited By: Srinu

Nov 22, 2019 | 3:14 PM

నచ్చిన పని చేయడానికి వయస్సుతో ఏ సంబంధం లేదని మరోసారి నిరూపించింది ఈ కేరళ బామ్మ.. మహిళా అక్షరాస్యత మిషన్ నిర్వహించిన నాలుగవ తరగతి పరీక్షకు హాజరయ్యి అందరినీ ఆశ్చర్యపరిచింది భగీరథి అమ్మ.. చిన్నప్పుడే తల్లి చనిపోవడం, తోబుట్టువులను చూసుకోవల్సిన బాధ్యత తనపై ఉండటంతో చిన్నప్పుడు చదవడం కుదరలేదని ఈ అమ్మ చెబుతోంది. ఇక యుక్త వయసుకి వచ్చేసరికి 30 ఏళ్లలోనే భర్తను కోల్పోవడం, ఆరుగురు పిల్లలని చదివించే బాధ్యత అంతా బామ్మ పైనే పడిందట. దీంతో […]

వయసు 105, చదివేది 4వ తరగతి
Follow us on

నచ్చిన పని చేయడానికి వయస్సుతో ఏ సంబంధం లేదని మరోసారి నిరూపించింది ఈ కేరళ బామ్మ.. మహిళా అక్షరాస్యత మిషన్ నిర్వహించిన నాలుగవ తరగతి పరీక్షకు హాజరయ్యి అందరినీ ఆశ్చర్యపరిచింది భగీరథి అమ్మ.. చిన్నప్పుడే తల్లి చనిపోవడం, తోబుట్టువులను చూసుకోవల్సిన బాధ్యత తనపై ఉండటంతో చిన్నప్పుడు చదవడం కుదరలేదని ఈ అమ్మ చెబుతోంది. ఇక యుక్త వయసుకి వచ్చేసరికి 30 ఏళ్లలోనే భర్తను కోల్పోవడం, ఆరుగురు పిల్లలని చదివించే బాధ్యత అంతా బామ్మ పైనే పడిందట. దీంతో తన 105ఏట చిన్నప్పటి ఆశ తీర్చుకుంటున్నానంటోంది ఈ చదువుల అమ్మమ్మ.

ఈ వయసులో కూడా బామ్మకు అద్భుతమైన జ్ఞాపకశక్తి, పదునైన కంటిచూపు ఉన్నందున ఈ పరిక్ష రాయడం కుదిరిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఎప్పుడో తన 9వ సంవత్సరంలో మూడవ తరగతి వరకూ చదివివ బామ్మ ఇఫ్పుడు 105వ ఏట నాలుగవ తరగతిలో తిరిగి చేరటం సంతోషంగా ఉందని చెబుతోంది.

ఈ బామ్మకు ప్రస్తుతం ఆధార్ కార్డు లేనందున వితంతువు ,వృద్ధాప్య పింఛను లాంటివి రాలేదని, ఆమెకు త్వరలోనే పెన్షన్ వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు భగీరథి అమ్మ అంటోంది