‘భారతీయుడు2’కి బ్రేకులు పడ్డాయా?

చెన్నై: విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భారతీయుడు 2’ సినిమా చిత్రీకరణ ఆగిపోయిందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. 23 ఏళ్ల తర్వాత మరోసారి శంకర్, కమల్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతోంది. జనవరిలో చిత్రీకరణ మొదలైంది. అయితే దర్శకుడు శంకర్‌కు.. సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌ సంస్థకు బడ్జెట్‌ విషయంలో అభిప్రాయభేదాలు తలెత్తాయని తమిళ వర్గాలు అంటున్నాయి. సాధారణంగా శంకర్‌ సినిమాలంటేనే ఎక్కువ […]

'భారతీయుడు2'కి బ్రేకులు పడ్డాయా?
Follow us

|

Updated on: Feb 19, 2019 | 12:56 PM

చెన్నై: విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భారతీయుడు 2’ సినిమా చిత్రీకరణ ఆగిపోయిందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. 23 ఏళ్ల తర్వాత మరోసారి శంకర్, కమల్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు ఇది సీక్వెల్‌గా రాబోతోంది. జనవరిలో చిత్రీకరణ మొదలైంది. అయితే దర్శకుడు శంకర్‌కు.. సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్‌ సంస్థకు బడ్జెట్‌ విషయంలో అభిప్రాయభేదాలు తలెత్తాయని తమిళ వర్గాలు అంటున్నాయి.

సాధారణంగా శంకర్‌ సినిమాలంటేనే ఎక్కువ బడ్జెట్‌తో భారీ స్థాయిలో తెరకెక్కుతుంటాయి. అయితే ‘భారతీయుడు 2’కు శంకర్‌ అడుగుతున్నంత బడ్జెట్‌ కేటాయించడానికి లైకా సంస్థ సిద్ధంగా లేదట. దాంతో గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా చిత్రీకరణను నిలిపివేసినట్లు సమాచారం. అయితే దీని గురించి చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.